కన్నడ నటుడు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కె.జి.ఎఫ్. తెలుగు, తమిళ, హింది, మళయాళ భాషల్లో భారీగా డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకధీరుడు రాజమౌళి పాల్గొనడం జరిగింది. సాయిని కర్ణాటక పరిస్థితి ఏంటని అడిగితే యశ్ గురించి చెప్పాడని అన్నారు రాజమౌళి.


కొత్త కుర్రాడు వచ్చాడు. వరుస హిట్లు కొడుతున్నాడని చెప్పాడట. అతని పేరే యశ్ అతను హీరోగా వస్తున్న సినిమా కె.జి.ఎఫ్. కన్నడ రాక్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో చేస్తున్న మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అయితే ఏప్రిల్ లో వీడియో క్వాలిటీ చూశాక సినిమా కచ్చితంగా పాన్ ఇండియా మూవీ అవుతుందని అన్నారు రాజమౌళి.


కేవలం కథ, నిర్మాత ఉంటే సరిపోదు ఇలాంటి పెద్ద సినిమా తీసేందుకు ఓ మంచి టీం కావాలి. అది ఈ సినిమా ఉందని అనుకుంటున్నానని రాజమౌళి అన్నారు. ఇక తెలుగు ప్రేక్షకులు ఏ భాషలో సినిమా వచ్చినా సరే బాగుంది అంటే సూపర్ హిట్ చేసేస్తారు. అది నా తెలుగు ప్రేక్షకులకు ఉన్న మంచి అలవాటని రాజమౌళి తెలుగు ఆడియెన్స్ మీద తన అభిప్రాయం చెప్పారు.


ఇక పాన్ ఇండియా సబ్జెక్ట్ తో భారీ మూవీగా వస్తున్న ఈ సినిమా కూడా అందరు ఆదరిస్తారని చెప్పారు రాజమౌళి. కోలార్ గోల్డ్ మైన్ కాన్సెప్ట్ తో వస్తున్న కె.జి.ఎఫ్ సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవడానికి ముఖ్య కారకుడు రాజమౌళి అని తను చెప్పిన మాటలను బట్టి చెప్పుకోవచ్చు. ఇక ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకు యశ్ అని.. ఇతను స్టార్ అయ్యాడు కాబట్టి యశ్ తన తండ్రిని డ్రైవర్ పని ఆపేయమన్నా తాను డ్రైవర్ గా ఉండే నిన్ను సూపర్ స్టార్ చేశానని చెప్పాడట. ఆ మాట విన్న తనకు నిజమైన స్టార్ హీరో అతనే అంటున్నాడు రాజమౌళి.      



మరింత సమాచారం తెలుసుకోండి: