‘బాహుబలి’ మూవీ తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ పై విపరీతమైన అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీని చాల మంచి ఫ్యాన్సీ రేట్లకు అమ్మి భారీ మొత్తాన్ని విడుదలకు ముందే లాభంగా పొందాలని ఈమూవీ నిర్మాతల ఆలోచనలు. 

ఇప్పటికే ఈమూవీ మేకింగ్ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చినా ఈమూవీకి సంబంధించి ప్రభాస్ పాత్రకు సంబంధించిన డైలాగ్స్ కాని ఈమూవీలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు సంబంధించిన సీన్స్ కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీనితో యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈమూవీని ఎలా తీస్తున్నాడు అన్న సందేహాలు కొంత వరకు ఈమూవీని కొనాలని భావిస్తున్న బయ్యర్లలో ఉన్నట్లు టాక్. 

దీనితో బయ్యర్లలో ఉన్న అనుమానాలను పోగొట్టడానికి ఈమూవీ నిర్మాతలు ఒక భారీ స్కెచ్ వేసినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించి ఇప్పటి వరకు షూట్ చేసిన సీన్స్ నుండి కొంత ఫుటేజ్ ని తీసి ఒక ట్రైలర్ మాదిరిగా కట్ చేసి ఆతరువాత ఎడిట్ చేసి ఆ ఫుటేజ్ ని ఇందాస్త్రీలోని కొందరి ప్రముఖులకు చూపిస్తున్నట్లు సమాచారం. ఈ ఫుటేజ్ ని చూసిన ఆ ఇండస్ట్రీ ప్రముఖులు ‘సాహో’ అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. 

ఈ ఫుటేజ్ ని చూసిన ఒక ఇండస్ట్రీ ప్రముఖుడు తన సన్నిహితులతో ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘సాహో’ లోని సీన్స్ చూసిన తరువాత తెలుగు సినిమా చూస్తున్నామా లేదంటే హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలిగినట్లు అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీమాన్ అందంగా ఉంటాడు అన్నది తెలిసిన విషయమే అయినా ఈ ఫుటేజ్ ని చూసిన వారికి ఈ అభిప్రాయం డబుల్ అవుతుంది అంటూ కామెంట్స్ చేసినట్లు టాక్. సాధారణంగా ఇండస్ట్రీ సీనియర్లు ఒక సినిమా గురించి ఇంత విపరీతంగా పొగడరు. అయితే దీనికి భిన్నంగా ఇలా పొగడ్తల వర్షం ఈ ఫుటేజ్ గురించి వస్తున్న నేపధ్యంలో ఇక రానున్న రోజులలో ‘సాహో’ మార్కెట్ కు ఆకాశమే హద్దు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: