ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ కి చాలా విషయాల్లో నిబద్ద్తత ఉంది. కష్టాన్ని నమ్ముకున్న ఆయన నిజాయతీకి, విలువలకు ప్రాణం ఇస్తారు. అదే సమయంలో ప్రతిభకు పట్టం కడతారు. అది మన ఇంటి గుమ్మంలోనే పుట్టి పెరగాలని  ఎప్పటికీ కోరుకోరు. అందుకే ఆయన సౌతిండియా సూపర్ స్టార్ అయ్యారు


విషయానికి వస్తే రజనీకాంత్ ది చాలా పెద్ద కుటుంబం. ఆ సంగతి చాలా మందికి తెలియదు. ఆయనకు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్కయ్య. చివరి వాడే మన వెండి తెర వేలుపు రజనీ అన్న మాట. ఇక పెద్ద అన్నయ్య సత్యనారయణరావు గైక్వాడ్ రజనీకి తండ్రితో సమానం. చిన్నపుడే తల్లి చనిపోతే అన్న, వదిన తల్లి తండ్రి అయి పెంచారు. ఇక రజనీ ఇంతటి వాడు అవుతాడని అన్నయ్య సత్యనారాయణరావు ఊహించకపోయినప్పటికీ రజనీ మంచి పేరు తెచ్చుకుంటాడని మాత్రం అపుడే అనుకున్నారట. రజనీ ఎత్తు పల్లాలను అన్నీ చూసిన సత్యనారాయణరావు గొప్ప మనిషి తన తమ్ముడు కావడం తన అద్రుష్టమని మురిసిపోతారు.


సత్యనారాయణరావు కు ముగ్గురు కుమారులు. అందులో రెండవ వాడు పాండురంగన్ కి తన బాబాయి రజనీ లాగానే సినిమాలు అంటే చాలా ఇష్టమట. అందుకోసం పూణే ఫిల్మ్ ఇన్సిటిట్యూట్ కి వెళ్ళి నటన లో తర్ఫీదు పొందాడట. ఎటూ బాబాయి సూపర్ స్టార్ కబట్టి తాను కూడా వెండి తెర మీద వెలిగిపోవచ్చునని అనుకున్నాడట. ఆ విషయం రజనీకి చెబితే వద్దు అంటూ తోసిపుచ్చాదట. పైగా వారసత్వం గా హీరోగా వస్తే నిలదొక్కుకోవడం కస్టమని కూడా క్లారిటీగా చెప్పేశాడట.
ప్రతిభ ఉన్నా కూడా ఇక్కడ రాణించడం కష్టమని, హాపీగా జాబ్ చూసుకోమని తన అన్న కుమారునికి హిత బోధ చేశాడట. ఇపుడు ఒక్కో హీరోకు కనీసం అరడజన్ మంది వారసులు పేరు చెప్పుకుని సినీ సీమలోకి వస్తున్న తరుణంలో వీరందరి  కంటే కూడా రజనీ గొప్ప వాడినని మాటలతో కాదు చేతలతో ఇలా నిరూపించుకున్నారు. దటీజ్ రజనీ.


మరింత సమాచారం తెలుసుకోండి: