టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు తెరకెక్కించారు.  స్టూడెంట్ నెం.1 సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసిన రాజమౌళి ఆయన సినిమాలో ఎదో ఒక ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్నారు.  ఈగ, బాహుబలి సీరీస్ తో జాతీయ, ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  దాంతో ఇప్పుడు జాతీయ స్థాయి నిర్మాతలు సైతం రాజమౌళితో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 
Image result for kgf telugu movie
ఈ సినిమా మొదటి నుంచి బారీ అంచనాలతో సంచనాలు క్రియేట్ చేస్తూ వస్తుంది.  1960 నుండి 1980 నాటి పరిస్థితుల్లో  జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.  కథ గోల్డ్ మైన్స్ మాఫియా బానిసత్వాన్ని ముగించాలని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. రాకీ పాత్రను పోషించే యాష్, అతను పెరుగుతున్నప్పుడు ప్రపంచాన్ని పరిపాలించాలని మరియు బానిసత్వాన్ని ముగించడానికి నిర్ణయించుకుంటాడు. డైలాగ్స్, కథనం, దర్శకత్వం  నటీనటుల ప్రదర్శనలు చాలామంది అభిమానులను ఆకట్టుకున్నాయి. 
Image result for kgf telugu movie
అన్ని భాషల్లో ఈ సినిమా ట్రైలర్ కి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సౌత్ లో భారీగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. నిన్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు రాజమౌళి. ఈ సందర్భంగా ఆయన హీరో యష్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు.  ఈ మద్య కన్నడ ఇండస్ట్రీలో హీరోల పొజీషన్ గురించి తెలుసుకుంటే..ఓ యువ హీరో వరుస విజయాలు అందుకుంటూ అభిమానుల ఆదరణ పొందుతున్నాడని తెలిసింది.
Image result for rajamouli at kgf event
మరి ఈ హీరో బ్యాగ్ గ్రౌండ్ ఏంటా అని తెలుసుకుంటే..ఓ బస్‌ డ్రైవర్‌ కొడుకు అని చెప్పారు. ఓ బస్‌ డ్రైవర్‌ కొడుకు కన్నడ ఇండస్ట్రీలో పెద్ద స్టార్‌ అయ్యారు. మరో గొప్ప విషయమేమంటే కొడుకు సూపర్‌స్టార్‌ అయినా తండ్రి మాత్రం ఇంకా బస్‌ డ్రైవర్‌గానే ఉన్నారు. యష్‌ కంటే ఆయన తండ్రే పెద్ద సూపర్‌స్టార్‌ అని నాకు అనిపించింది. ఆయనకు నా హ్యాట్సాఫ్‌'' అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డిసంబర్ 21న విడుదల చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: