తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యువ దర్శకుల హవా నడుస్తుంది.  ఆ మద్య ‘ఘాజీ’చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోనే కాదు జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఇక ఫిదా, తొలిప్రేమ చిత్రాల ఘన విజయం తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'అంతరిక్షం' సినిమా రూపొందింది.  వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో లావణ్యత్రిపాఠి .. అదితీరావు కనిపించనున్నారు. షూటింగ్ జరిగినన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వరుణ్ తేజ్ కొత్త సినిమా అంతరిక్షం 9000 కెఎంపిహెచ్ ట్రైలర్  రిలీజ్ అయ్యాక ఆ చిత్రంపై తెగ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 
Anthariksham teaser released
ఈ చిత్రం ఇండియాలోనే మొదటి ఒరిజినల్ స్పేస్ థ్రిల్లర్ గా చెప్పబడుతోంది.   దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఘాజీ తరహాలోనే స్టోరీ పాయింట్ ధైర్యంగా ముందే రివీల్ చేసేసాడు. ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. పూర్తి అంతరిక్ష నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుగులో రాలేదు కాబట్టి ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం సంకల్ప్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.  ఇండియన్ స్పేస్ సెంటర్ చేస్తున్న ఓ శాటిలైట్ ప్రయోగం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడుతుంది.

దీన్ని పరిష్కరించడంలో అంతకు ముందు అదే సెంటర్ పనిచేసి ఏవో కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయిన దేవ్(వరుణ్ తేజ్)ని పిలిపిస్తారు. ఆవసరాల శ్రీనివాస్ వరుణ్ తేజ్ స్నేహితుడిగా కీలక పాత్రలో కనిపిస్తుండగా సెంటర్ బాద్యతలు చూసుకునే వ్యక్తిగా రెహమాన్ పాత్ర కూడా ప్రాధాన్యత ఉన్నదిగానే కనిపిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ స్పేష్ లో ఎలాంటి ధైర్యం చేస్తాడు..ఎలాంటి త్యాగం చేస్తాడన్న విషయం చూపు తిప్పనివ్వకుండా చేస్తాయని చిత్ర యూనిట్ అంటున్నారు. 

ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ ను రాబట్టగా, 100K లైక్స్ లభించాయి. అలా యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ ట్రైలర్ నెంబర్ వన్ పొజీషన్లో నిలిచింది.ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు. ఇక ఇటీవల కథానాయికల రేసులో కాస్త వెనుకబడిన లావణ్య త్రిపాఠి కూడా, ఈ సినిమా సక్సెస్ పైనే ఆశలు పెట్టుకుంది.     


మరింత సమాచారం తెలుసుకోండి: