సూపర్ స్టార్ రాజినీకాంత్ వేలకోట్ల ఆస్తులకు అధినేత. అలాంటి రజినీకాంత్ చిన్నతనంలో తన తండ్రి చనిపోయాక వచ్చే 100 రూపాయల పెంక్షన్ తో రజినీ కుటుంబ జీవితం గడిచేది అంటే ఎవరూ నమ్మరు. అయితే అలాంటి పరిస్థుతులలో రజినీకాంత్ ను అతడు కోరుకున్న విధంగా మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేర్పించి అప్పట్లో నెలకు 500 రూపాయలు రజినీ ఖర్చుల నిమిత్తం పంపిస్తూ రజినీకాంత్ తొలినాళ్ళ కెరియర్ కు అన్ని విధాల సహకరించిన సోదరుడు సత్యనారాయణ రావు రజినీ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను లీక్ చేసాడు.
 చైనాలో రికార్డ్ స్థాయి రిలీజ్
రజినీకాంత్ తన చిన్నతనంలో తనకు సహకరించిన ఎవర్నీ మర్చిపోడనీ తన సన్నిహితులు కష్టాలలో ఉన్నారు అని తెలుసుకుని వెంటనే అడగకుండానే సహాయం చేయడం రజినీ తీరు అంటూ తన తమ్ముడు పై ప్రశంసలు కురిపిస్తున్నాడు సత్యనారాయణ రావు. అయితే రజినీకాంత్ మనస్తత్వం ఎంత వరకు రాజకీయాలకు సరిపోతుందో అన్న విషయంలో తనకు కూడ కొన్ని సందేహాలు ఉన్న విషయాన్ని చెపుతూ ఒకసారి రజినీ తలచుకుంటే విజయం సాధించడం తన నైజం అంటూ రజినీ పట్టుదల గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. 
 అక్కడ గట్టిగా కొడితే బ్రహ్మాండం బద్దలవుతుంది
రజినీకాంత్ పై చిన్నతనం నుండి ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంది అని చెపుతూ ప్రతిరోజు రజినీ స్కూల్ కు వెళ్ళే డప్పుడు శివుడుని దర్శించుకుని వెళ్ళడం అతడి అలవాటు అని అంటూ కాలినడకన  హిమాలయాలలో 50 కిలోమీటర్లు నడిచిన శక్తీ రజినీకాంత్ సొంతం అంటూ రాజినీలోని ఆధ్యాత్మిక కోణాన్ని మరోసారి బయట పెట్టాడు సోదరుడు. చిన్నతనంలో చదువు సరిగ్గా రాకపోవడంతో బస్సు బస్సు కండెక్టర్ గా రజినీ పనిచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఆ ఉద్యోగం కూడ సరిగ్గా చేయలేక సినిమాల పై మోజుతో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నై వెళ్ళిపోయిన సందర్భాన్ని వివరించాడు సత్యనారాయణ,
ఆ రికార్డులను అందుకోవడం కష్టమే
రజినీకాంత్ నడకలోని స్టైల్ గురించి వివరిస్తూ రజినీ తన చిన్నప్పటి నుండి ఫాస్ట్ గా నడవడం మరింత ఫాస్ట్ గా మాట్లాడటం అతడి అలవాటు అని అంటూ ఆ స్టైల్ రజినీకాంత్ కు సూపర్ స్టార్ ఇమేజ్ ని తెచ్చి పెడుతుందని తాను కలలో కూడ అనుకోలేదు అంటూ తన తమ్ముడు కారణ జన్మముడు అని అంటున్నాడు సత్యనారాయణ రావు. ఇదే సందర్భంలో రజినీ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ తన తమ్ముడికి రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్న విషయం నిజమే అని అంటూ మెహర్ బాబా అనుగ్రహం వల్ల తన తమ్ముడు ఎలాంటి అనారోగ్య సమస్యలను అయినా జయిస్తాడు అని అంటున్నాడు  సత్యనారాయణరావు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: