సూపర్ స్టార్ రజినికాంత్ కు ఎందుకు అంత ఫాలోయింగ్.. ఈ ప్రశ్నకు సింపుల్ ఆన్సర్ ఆయన స్టైలే అని అందరు చెబుతారు. బస్ కండక్టర్ గా పనిచేసే ఆయన సూపర్ స్టార్ గా ప్రేక్షకుల మనసు గెలిచాడు. రజినికాంత్ అసలు పేరు శివాజి రావు గైక్వాడ్.  1950 డిసెంబర్ 12న కర్ణాటకలో రజినికాంత్ జన్మించారు.


బస్ కండక్టర్ గా పనిచేస్తున్న ఆయన్ను బాలచందర్ చూసి ఆయన్ను అపూర్వ రాగంగల్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. తెలుగులో రజినికాంత్ మొదటి సినిమా అంతులేని కథ. తమిళ హీరోగా అశేష ప్రేక్షక అభిమానం సంపాదించిన రజినికాంత్ దేశంలో గొప్ప నటులలో ఒకరని చెప్పొచ్చు. ఇక రజిని స్టైల్ కు విదేశీ అభిమానులు కూడా ఎక్కువే.


సిగరెట్ స్టైల్ గా వెలిగించే స్టైల్ నుండి స్టైల్ గా నడవడం లాంటివి రజిని సినిమా మీద ఆసక్తి పెంచేలా చేశాయి. ఈమధ్యనే 2.ఓతో మరోసారి తన సత్తా చాటారు రజినికాంత్. తమిళనాట ఆయన సినిమాలు సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. రజిని సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అన్నట్టుగా సందడి ఉండేది. 


ఇక తెలుగులో కూడా రజినికి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసేవారు. తెలుగులో భాష, నరసిం హా, అరుణాచలం, ముత్తు, చంద్రముఖి, రోబో, శివాజి సినిమాలు పెద్ద సక్సెస్ అందుకున్నాయి. స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిన రజిని ఈ డిసెంబర్ 12కి 68 వసంతాలను పూర్తి చేసుకుని 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: