మెగా బ్రదర్ నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  విలేకరి బాలయ్య గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఎవరో తెలియదని అన్నారు..అంతలోనే బాలయ్య గారా..గొప్ప నటులు అని ఎన్నో సినిమాల్లో నటించారని అన్నారు.  మరోసారి బాలయ్య ప్రస్తావన తెచ్చినా..ఆయన ఎవరో తెలియదనే సమాధానం చెప్పారు నాగబాబు. దాంతో చిరంజీవి సోదరుడు నాగబాబుపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.  తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు నాగబాబు. తాను టీవీలు, యూట్యూబ్ ల వంటివి ఎక్కువగా చూడనని నాగబాబు అన్నారు. 

తన వ్యాఖ్యలతో కొంత మంది ఫీల్ అయ్యారని తనకు తన స్నేహితుల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పారు. అలా అనడం తప్పుకదా, మీకు తెలియదా? అని అడిగారని తెలిపారు. బాలకృష్ణ ఎవరో తెలియదు అని అనడం నిజంగానే మిస్టేక్ అని చెప్పారు.   ఆయన మంచి నటుడని, పెద్ద కమెడియన్ అని, హాస్యాన్ని అద్భుతంగా పండించగల అతి కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించారు. ఈయనకు 'అంజిగాడు' అనే నిక్ నేమ్ కూడా ఉందని చెప్పారు.

ఈ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ నవ్వుకుంటుంటే..నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ..కళ్యాణ్ మొదట ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో తనకు సరిపడలేదు. మర్యాదపూర్వకంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత తన సహనటి రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నారు.

వారి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ ఉమ్మడి అంగీకారంతోనే విడిపోయారు. ఈ ఇద్దరు అమ్మాయిలను నేను విమర్శించను. ఇక  ఇప్పుడున్న రష్యన్ జాతికి చెందినదైనా.. భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తుంది. ఆమెను చూస్తే ముచ్చటేస్తుంది.  అంతే కాదు ఆమెను అన్నయ్య చిరంజీవి  దగ్గర నుండి మా కుటుంబంలో అందరూ ఆమెను ఇష్టపడతారు.  పవన్ మంచి భార్యను పొందారని అనుకుంటాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: