తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ జీవితం ఆధారంగా నట జీవితం, రాజకీయ జీవితం పై రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ రాబోతుంది.  ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా జనవరి నెలలో ఈ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ కథానాయకుడు పై ఫస్ట్ లిరిక్ రిలీజ్ చేశారు.  కీరవాణి సంగీత సారథ్యంలో ఈ పాట కైలాష్ కేర్ పాడారు.
Image result for ntr biopic
తాజాగా ఎన్టీఆర్ మహానాయకుడు కి సంబంధించిన మరో లిరిక్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపారు. కారణమేమిటనేది తెలియదు గానీ, ఈ ఆలోచనని విరమించుకుని 2వ సాంగ్ విడుదల తేదీని ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ తో బాలకృష్ణ మంచి మార్కులు కొట్టేశారు. ఆయనతో 10 మందికి పైగా కథానాయికలు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 
Image result for ntr biopic
ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.  కాగా, రేపు తెలంగాణలో ఎన్నికల రిజల్ట్ ఉన్న సందర్భంగా మొత్తం చూపు అటువైపే ఉంటుందని..ఈ సమయంలో ‘ఎన్టీఆర్’ లిరిక్ రిలీజ్ చేయడం సబబు కాదని..అందుకే వాయిదా వేసి ఉంటారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: