కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విజయ్ సినిమా అంటే కోలీవుడ్ లో ఆ ప్రకంపణలు వేరేలా ఉంటాయి. దురదృష్టవశాత్తు విజయ్ సినిమాలకే వివాదాలు కూడా ఏర్పడతాయి. రీసెంట్ గా వచ్చిన సర్కార్ సినిమా కూడా గొడవలతో వచ్చి బంపర్ హిట్ కొట్టింది.


ఇక ఇప్పుడు విజయ్ తన తర్వాత సినిమా మళ్లీ అట్లీ డైరక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. తెరి, మెర్సల్ సినిమాల తర్వాత ఈ ఇద్దరు చేస్తున్న హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ లీక్ అయ్యింది. క్రీడా నేపథ్యంలో జరిగే రాజకీయాల గురించి ఈ సినిమాలో ప్రస్థావించబోతున్నారట.


125 కోట్లు ఉన్న భారతదేశంలో ఒలంపిక్స్ లో ఎందుకు పతకాలు తీసుకు రావడం లేదని ఈ సినిమాలో చెబుతారట. దీని వెనుక ఉన్న రాజకీయ శక్తుల గురిచి కూడా అట్లీ ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.  


సర్కార్ సినిమా తెలుగులో కూడా విజయ్ కు మంచి హిట్ ఇచ్చింది. తెలుగులో సర్కార్ సినిమాకు ఇంకాస్త ప్రమోషన్స్ చేసి ఉంటే బాగా ఆడేదని అంటున్నారు. అయితే అట్లీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఈసారి ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. విజయ్ తెలుగు ఫ్యాన్స్ కు ఇది శుభవార్తే అని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: