ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచురల్ లిస్టులో సల్మాన్ ఖాన్ తరువాత టాప్ స్థానంలో కొనసాగుతున్న ప్రభాస్ పెళ్ళి గురించి వార్తలు ఇప్పుడు తెలుగు మీడియాకు మాత్రమే కాకుండా జాతీయ మీడియాకు కూడ హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ పెళ్లి పై అతడి సన్నిహితులు ప్రముఖ దర్శకుడు రాజమౌళి వేసిన జోక్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
కాఫీ విత్ కరణ్
ఈ ఆసక్తికర సంఘటన కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘మై కాఫీ విత్ కరణ్ జోహార్’ కార్యక్రమంలో జరిగింది. ఈమధ్యనే రికార్డింగ్ పూర్తి చేసుకున్న ఈకార్యక్రమం వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న నేపధ్యంలో ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ రాజమౌళి రానా లకు సంబంధించిన ఫోటోలను మీడియాకు లీక్ చేస్తూ ఈకార్యక్రమానికి మరింత రేటింగ్స్ వచ్చేలా ఈకార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న స్టార్ వరల్డ్ ఛానల్ ప్రయత్నాలు చేస్తోంది. 
 బాహుబలిని హిందీలో
ఈకార్యక్రమాన్ని నిర్వహించిన కరణ్ జోహార్ ప్రభాస్ ను పెళ్లి గురించి ప్రశ్నిస్తూ పెళ్లి గురించి అనేక ప్రశ్నలు వేసాడు. ఈ ప్రశ్నలకు ఎప్పటిలాగే ప్రభాస్ దాటవేసే సమాధానాలు ఇస్తున్న నేపధ్యంలో మధ్యలో రాజమౌళి కల్పించుకుని ప్రభాస్ పెల్లికన్నా ముందుగా రానా పెళ్లి అవుతుందని ఎప్పుడు పెళ్ళి జరుగుతుందో ప్రభాస్ కే తెలియని విషయాల పై ప్రశ్నలు ఎందుకు అంటూ జోక్ చేసాడు రాజమౌళి. 
కరణ్ జోహార్ కన్ను పడిందా
ఈకార్యక్రమానికి సంబంధించి మీడియాకు విడుదల చేసిన ప్రోమోలో రాజమౌళి ప్రభాస్ పెళ్లి పై చేసిన ఆసక్తికర కామెంట్స్ కు సంబంధించిన క్లిపింగ్స్ పెట్టారు. దీనితో ఈకార్యక్రమంలో ప్రభాస్ పెళ్లి గురించి ఇంకా ఎన్ని జోక్స్ ఉంటాయో అన్న ఆసక్తి బాగా పెరిగిపోతోంది. కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘మై కాఫీ విత్ కరణ్ జోహార్’ షోకు ప్రభాస్ రానా రాజమౌళిల వల్ల మరింత భారీ రేటింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది అని బుల్లితెర విశ్లేషకులు అంటున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: