రేపటి రోజున జరగబోతున్న రజినీకాంత్ పుట్టినరోజు వేడుకల గురించి జాతీయ మీడియా నుండి తమిళ మీడియా వరకు రజినీకాంత్ వ్యక్తిత్వం పై అనేక ఆసక్తికర కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో సోషల్ మీడియాలో రజినీకాంత్ వ్యక్తిత్వం పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్న కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 
Super Star Rajini Kanth Latest Hot Stills In Kabali (10)
దీనికి కారణం రజినీకాంత్ తన దగ్గర పనిచేసే ఒక సర్వెంట్ మెయిడ్ ను అవమాన పరిచాడు అంటూ కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈమధ్య ‘2.0’ మూవీ స్పెషల్ షోను రజినీకాంత్ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక ధియేటర్ ను బుక్ చేసి చెన్నైలో వేయడం జరిగింది. 

ఈ షోకు రజినీకాంత్ తన భార్య లతతో పాటు రావడమే కాకుండా వారి మధ్యన వారి మనవడును పెట్టుకుని ‘2.0’ మూవీని ఎంజాయ్ చేసారు. అయితే వారంతా ఆసినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే వారి వెనుక ఒక సర్వెంట్ మెయిడ్ నుంచుని ఆసినిమాను చూస్తోంది. 

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన దగ్గర పనిచేసే పనివాళ్ళను నుంచో పెట్టుకుని సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రజినీకాంత్ తన దగ్గర పనిచేసే పని వాళ్ళను కనీసం దూరంలో అయినా కూర్చోమని చెప్పే సంస్కారం లేదా అంటూ నెటిజన్లు రజినీ పై సెటైర్లు వేస్తున్నారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ముఖ్యంత్రి కావాలని ప్రయత్నిస్తున్న రజినీకాంత్ మంచితనం ఇదేనా అంటూ కొందరు వేస్తున్న సెటైర్లు పుట్టినరోజు పూట రజినీకాంత్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయి అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు..   


మరింత సమాచారం తెలుసుకోండి: