స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తున్నారా.. తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేయబోతున్నారా.. అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా ఏంటన్నది హాట్ న్యూస్ గా మారింది. త్రివిక్రం తో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ కాగా ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ న్యూ ఇయర్ రోజున వస్తుందట. జనవరి 1, 2019 రోజున బన్ని, త్రివిక్రం మూవీ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. ఆరోజే సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.


జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రం లు హ్యాట్రిక్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అజ్ఞాతవాసి ఫ్లాప్ అవగా అరవింద సమేత సినిమా హిట్ అందుకుంది. త్రివిక్రం సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే.


మెగా హీరోలతో త్రివిక్రం సినిమా అంటే మెగా ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. జనవరి 1న ఎనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ ఆ నెల ఎండింగ్ లో స్టార్ట్ చేస్తారని అంటున్నారు. 2019 దసరాకి ఈ సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: