షకీలా గురించి తెలియని వారి ఎవరుండరని చెప్పాలి. బి గ్రేడ్ మూవీస్ తో ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది . అయితే చిత్రసీమలో లైంగిక వేధింపులపై అలనాటి శృంగార తార షకీలాస్పందించారు. గతంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. #MeToo లో భాగంగా పరిశ్రమలో వేధింపులను బయటపెడుతున్న తారల గురించి స్పందిస్తూ.. తాను ఆలస్యంగా స్పందించే రకాన్ని కాదని, వెంటనే సమాధానం చెప్పేదానినని తెలిపారు.

Image result for shakeela

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిలకు లైంగిక వేధింపులు సాధారణమే. అయితే, అలాంటివి ఎదుర్కొన్నప్పుడు వెంటనే బయటపెట్టాలి. ఏళ్లు గడిచిన తర్వాత చెప్పడం తెలివైన పనికాదు. చిత్రపరిశ్రమలో అడుగుపెట్టే చాలామంది ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్ని ఉంటారు. నాపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే, వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాను.

Image result for shakeela

ఆ రోజు నాపై చేతులు వేసినవాళ్లు... ఈ రోజు నన్ను చూస్తే చేతులు కట్టుకుంటారు’’ అని తెలిపారు. శృంగార తారగా ఒకప్పుడు మలయాళం పరిశ్రమనే వణికించిన షకీలా జీవితంపై సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ నటి రిచా చద్దా షకీలా పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా లో చాలా మంది గురించి నిజాలను బయట పెట్టే అవకాశం ఉంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: