సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా భారీ ఫాలోయంగ్ ఉంటుంది. అక్కడ మిలియన్ డాలర్స్ క్లబ్ అలవాటు చేసింది మహేష్ బాబే. ఇప్పటికే సినిమా ఫ్లాప్ అయినా సరే మహేష్ సినిమాలు ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి.


శ్రీమంతుడు సినిమా యూఎస్ లో భారీ హిట్ గా నిలిచింది. అయితే భరత్ అనే నేను సినిమా కూడా యూఎస్ లో హిట్ అందుకోగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేయడంతో ఆ సినిమా బ్రేక్ ఈవెంట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలిసింది. అయితే దిల్ రాజు నిర్మాతగా వస్తున్న మహర్షి సినిమాకు ఓవర్సీస్ లో భారీ రేటు కోట్ చేశాడట.


ఆ రేటుకి ముందుకొచ్చేందుకు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ భయపడుతున్నట్టు తెలుస్తుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న మహేష్ మహర్షి సినిమాపై యూఎస్ లో పాతిక కోట్ల దాకా కోట్ చేశాడట దిల్ రాజు. అయితే బ్లాక్ బస్టర్ హిట్టైనా సరే 15 నుండి 18 కోట్లు కలెక్ట్ చేస్తున్న అక్కడ 20 కోట్లు పైన రాబట్టాలి అంటే 4 మిలియన్ డాలర్స్ వసూళు చేయాల్సి ఉంటుంది.


మరి మహర్షి సినిమాకు అంత వస్తుందా అన్నడౌట్ తోనే ఈ సినిమా ఇంకా బిజినెస్ క్లోజ్ చేయలేదట. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న మహర్షి సినిమా మహేష్ 25వ సినిమాగా వస్తుంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ అయితే ఇప్పటికే డీల్ సెట్ అయినట్టు తెలుస్తుంది. మరి యూఎస్ లో మహర్షి బిజినెస్ ఫైనల్ గా ఎంతకు కొంటారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: