మెగా కుటుంబం నుండి యంగ్ హీరోలుగా పరిచయం అయి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ టాప్ యంగ్ హీరోల లిస్టులో చేరిపోతే వరుణ్ తేజ్ ప్రామిసింగ్ హీరోల లిస్టులో చేరిపోయాడు. దీనికితోడు చరణ్ వరుణ్ తేజ్ ల మధ్య చాల మంచి సాన్నిహిత్యం ఉంది. వరుణ్ తేజ్ కెరియర్ కు సంబంధించి సలహాలు ఇవ్వడమే కాకుండా మంచి దర్శకులు అదేవిధంగా మంచి నిర్మాణ సంస్థలు వరుణ్ తేజ్ కు వచ్చేలా చరణ్ పరోక్ష సహకారం అందిస్తున్నాడు అంటూ మెగా కుటుంబ సన్నిహితులు అభిప్రాయ పడుతూ ఉంటారు. 

ఇలాంటి పరిస్థుతులలో వరుణ్ తేజ్ ఏకంగా రామ్ చరణ్ మూవీకి పోటీగా నిలబడే పరిస్థుతులు ఏర్పడటం ఒక విధంగా ఈ అన్నదమ్ములు ఇద్దరికీ పెద్ద తల నొప్పిగా మారిందని టాక్. వచ్చేనెల రాబోతున్న సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ రామ్ చరణ్ భారీ మూవీ ‘వినయ విధేయ రామ’ విడుదల కాబోతోంది. 

అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇదే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ దిల్ రాజ్ నిర్మాణంలో రాబోతున్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ కూడ సంక్రాంతికే విడుదల చేస్తున్నారు. వెంకటేష్ వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ఈమూవీ ఓకే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్న వార్తలు వస్తున్నాయి. 

నిర్మాత దిల్ రాజ్ ఈమూవీ పై తనకు ఉన్న అంచనాలతో ‘వినయ విధేయ రామ’ ‘ఎన్టీఆర్ బయోపిక్ కథా నాయకుడు సునామీలను లెక్క చేయకుండా తన ‘ఎఫ్ 2’ కూడా సంక్రాంతి రేసులో దింపుతున్నాడు. దీనితో ఈ అనివార్యమైన పోటీ రామ్ చరణ్ వరుణ్ తేజ్ లకు ఇష్టం లేకపోయినా రాబోతున్న సంక్రాంతి రేసులో ఈ మెగా యంగ్ హీరోలు తలబడుతున్న నేపద్యంలో అనుకోకుండా చరణ్ సినిమా పై వరుణ్ తేజ్ సినిమా ఫై చేయి సాధిస్తే తనకు అసౌకర్యంగా ఉంటుందని చరణ్ భావిస్తూ దిల్ రాజ్ ను తన ‘ఎఫ్ 2’ సంక్రాంతి తరువాత విడుదల చేయమని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: