ప్రస్తుతం 2.0 మూవీ భారీ సక్సెస్ తో సంతోషంలో ఉన్న రజినీకాంత్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.   రేపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు 'పెట్టా' సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.  భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రజినీకాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  సింగపూర్, హాంకాంగ్, మలేషియా, అమెరికాలో ఆయన అంటే ఎంతగానో అభిమానిస్తారు.  అంతగా అభిమానించే రజినీకాంత్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సంబరాలు చేసుకుంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 
Related image
అయితే రజినీకాంత్ మాత్రం తన పుట్టిన రోజు హంగూ ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు.  ఫ్యాన్స్ మాత్రం పెద్ద కటౌట్స్ పెట్టి, పూజలు చేసి, స్వీట్లు పంచుతుంటారు.  అయితే రేపు రజినీకాంత్ పుట్టిన రోజు మాత్రం ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారు..అదే ఆయన నటించిన ‘పెట్టా’మూవీ నుంచి టీజర్.  మాఫియా నేపథ్యంలో ఉండే ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ మద్య రెండు లిరిక్స్ కూడా రిలీజ్ చేశారు.  ఈ సినిమాలో రజినీకాంత్ స్టైల్..మాస్ లుక్ చూస్తుంటే మరోసారి ‘భాషా’మూవీ రిపీట్ అవబోతుందని అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పెట్టా'మూవీ చేశారు. సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా చేసిన ఈ సినిమా, సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆసక్తికరమైన కథనంతో నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. '2.ఓ' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న రజనీ అభిమానులు, 'పెట్టా' బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: