తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య దర్శకులు మారుతి దర్శకత్వంలో సుదీర్ బాబు, నందిత జంటగా 2013 లో వచ్చిన 'ప్రేమకథా చిత్రం' అద్భుతమైన విజయం అందుకుంది.  ఈ చిత్రంలో హర్రర్ తో పాటు కామెడీ, సెంటిమెంట్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు.  అయితే ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  ముఖ్యంగా హర్రర్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న చిత్రాలు మినిమం పెట్టిన పెట్టుబడులు అందుకుంటున్నాయి.
Image result for prema katha chitram2 movie
తాజాగా హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ , నందిత శ్వేత, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలుగా ‘ప్రేమకథా చిత్రం 2’తెరకెక్కుతుంది.  ఈ చిత్రం కామెడీ, హర్రర్   నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా నిర్మాత మాట్లాడుతూ..‘ప్రేమకథా చిత్రం 2’అనుకున్న దానికన్నా బాగా  వచ్చింది.  అందుకే హిందీ శాటిలైట్,డబ్బింగ్ హక్కులు కోటి నలభై మూడు లక్షలకి అమ్ముడయ్యాయి. 
‘ప్రేమకథా చిత్రమ్2’ మూవీ స్టిల్స్
ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఒకరకమైన థ్రిల్ అనుభవిస్తారని..నవ్విస్తూనే భయపెట్టే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని..ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ కాంబినేషన్లో వచ్చే కామెడీ హైలైట్ అవుతుంది. త్వరలో ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయబోతున్నామని..జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది  అని ఆయన చెప్పుకొచ్చారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: