తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తమిళనాట ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు.  ఈ సంవత్సరం స్టార్ డైరెక్టర్ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఇదే జోష్ తో ‘పెట్టా’సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్,రెండు లిరిక్ సాంగ్ రిలీజ్ అయ్యాయి.  నేడు రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ‘పెట్టా’టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.  ఇక రజినీకాంత్ అల్లుడు ధనుష్ కూడా మాస్ హీరోగా మంచి గుర్తింపు పొందారు. 
Image result for mari 2 movie
రజినీకాంత్ అల్లుడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయిన ధ‌నుష్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, సింగ‌ర్ ఇలా మ‌ల్టీ టాలెంట్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు.  ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న మారి 2 సినిమా ప్రమోషన్ బిజీలో ఉన్నారు.  గతంలో ‘మారి’సినిమాతో మంచి క్రేజ్ సంపాదించిన ధనుష్ ఈ సినిమా సీక్వెల్ మారి 2 లో నటిస్తున్నారు.  ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. ఇటీవ‌ల చిత్ర త‌మిళ వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.
Related image
ఇందులో ధ‌నుష్ లుక్ అదిరిపోయింది. స‌న్నివేశాలు త‌మీళ తంబీల‌కి మంచి వినోదాన్ని అందించాయి. ధనుష్ తమిళంలో ఏ సినిమాలో నటించినా తెలుగు లో డబ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇది అభిమానులని ఆక‌ట్టుకునేలా ఉంది. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది.యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. . ఆయ‌న సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుద‌ల అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: