తెలంగాణలో నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చాయి.  అందరి అంచనాలు తలకిందులు చేస్తూ..టీఆర్ఎస్ ఘన విజయం అందుకుంది.  అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్, టిటిడిపి, టిజెఎస్, సిపిఐ మహాకూటమిగా ఏర్పడి ముమ్మర ప్రచారం చేశారు.  కానీ ఫలితాలు విషయానికి వస్తే..సీనియర్ నేతలు కట్టకట్టుకొని ఓడిపోయారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మహాకూటమిపై రక రకాల విమర్శలు, ఫోటోలు, స్ఫూఫ్ లు వస్తున్నాయి. 

ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇలాంటి విషయాల్లో ముందుంటారన్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కేటీఆర్ లను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

మహేష్ బాబు 'ఆగడు' సినిమాలో ఓ యాక్షన్ సీన్ ని స్పూఫ్ చేసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. కేసీఆర్ '2.0' కాదు.. కానీ రజినీకాంత్ కంటే 20.0 రెట్లు, మహేష్ బాబు కంటే 200.0 రెట్లు, చంద్రబాబు నాయుడు కంటే 2000.0 రెట్లు ఎక్కువ' అంటూ ట్వీట్ చేశాడు.   

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ వీడియో, ట్వీట్ చూస్తు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.  సమయానుకూలంగా స్పందించడం అంటే ఇదే..

మరింత సమాచారం తెలుసుకోండి: