తెలుగు, తమిళ ఇండస్ట్రీల సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంతో క్రేజ్ ఉంది.  ఈయన నటించిన చిత్రాలు జాతీయ స్థాయిలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబడుతుంటాయి.  విదేశాల్లో సైతం రజినీకాంత్ చిత్రాలంటే విపరీతమైన క్రేజ్ ఉంది.  గత నెల శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘2.0’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కలెక్షన్లు రాబట్టింది.  తాజాగా రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు 'పెట్టా' చిత్రాన్ని రూపొందించాడు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఈ రోజున రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో, అభిమానులలో సంతోషంలో ముంచెత్తించేందుకు 'పెట్టా' చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, రెండు లిరిక్స్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తున్న తరుణంలో నేడు టీజర్ రిలీజ్ చేశారు. 

రజినీకాంత్ తన మేనరిజంతో స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే సీన్ తో టీజర్ మొదలైంది.  మాటలు లేకుండా కేవలం రజినీకాంత్ స్టైల్, లుక్స్ నే ప్రధానంగా చేసుకొని టీజర్ ని కట్ చేశారు. అభిమానులతో కలిసి తలైవా డాన్స్ చేయడం, సాంప్రదాయంగా బొట్టు పెట్టుకొని అతిధులకు బోజనం వడ్డించడం.. అద్దం ముందు నిలబడి స్టైల్ గా కళ్లజోడు పెట్టుకుంటూ రజినీకాంత్ ఇచ్చిన స్మైల్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది.

టీజర్ ని బట్టి రజినీకాంత్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిషలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా, నవజుద్ధీన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: