నాగ చైతన్య ఈ మధ్య అత్త సెంటిమెంట్ మూవీస్ ఎక్కువగా చేస్తున్నారు.  అందాల భామలు అత్తలుగా నటిస్తున్నారు. శైలజారెడ్డి అల్లుడు మూవీలో నాగ చైతన్య అత్తగా రమ్యక్రిష్ణ చేసిన సంగతి విధితమే. ఇపుడు అదే వరసలో మరో బ్యూటి అత్తమ్మగా నాగచైతన్య‌ కొత్త చిత్రంలో కనిపిస్తోంది. మామగా నిజ జీవితంలో మేనమామ వెంకీయే కావడం విశేషం.


విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య జోడీతో వెంకీ మామ పేరిట కొత్త మూవీ సెట్స్ పైన ఉంది.ఈ మూవీలో వెంకటేష్ జోడీగా మొదట  వేరే హీరోయిన్ని అనుకున్నారట. ఆమెతో కొన్ని సీన్లు తీసిన తరువాత సూట్ అవదని మార్చేసారు. ఆ చాన్స్ ఇపుడు ఆల్ టైం బ్యూటీ శ్రియను వెతుక్కుంటూ వచ్చింది. శ్రియ ఇపుడు వెంకీ మామకు జతగా, చైతూకి అత్తగా నటిస్తోందన్నమాట. 


ఇప్పటికి వెంకటేష్, శ్రియ రెండు సినిమాల్లో నటించారు. ఇది ముచ్చటగా మూడవ చిత్రమన్న మాట. ఇక శ్రియ సీనియర్ హీరోలకు సరి జోడీగా ఎప్పటికపుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తోంది. లేటెస్ట్ గా అన్న గారి బయోపిక్ లో బాలయ్య పక్కన ఓ సాంగ్ లో నటించిన శ్రియ ఇపుడు మరో సీనియర్ హీరో వెంకీకి జోడీగా సెలెక్ట్ కావడంతో పెళ్ళి అయిన తరువాత కూడా శ్రియ హవా టాలీవుడ్లో ఏ మాత్రం తగ్గలేదనడానికి ఇది నిదర్శనం.


మరింత సమాచారం తెలుసుకోండి: