మెగా పవర్ స్టార్ రాం చరణ్ పక్కన ఆడి పాడడం అంటే ఆషా మాషీ కాదు. మంచి డ్యాన్సర్ గా కూడా చరణ్ ప్రూవ్ చేసుకున్నాడు. పైగా మెగాభిమానుల అంచనాలు కూడా ఓ రేంజిలో ఉంటాయి. మరి కనీసం ఒక ఐటెం నంబర్ అయినా చరణ్ పక్కన చేయాలని ప్రతి  ఒక్క హీరోయిన్ కి  ఉంటుంది. కానీ లక్ ఉంటేనే ఆ చాన్స్ వస్తుంది. ఇపుడు అలాటి చాన్స్ ఓ అమ్మడికి వచ్చిందట. దాంతో ఆమె ఆనందం పట్టడం కష్టమైపోతోంది.


రాం చరణ్, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న వినయ విదేయ  రామ మూవీ లో ఓ ఖతర్నాక్ లాంటి ఐటెం నంబర్ ఉందిట. పబ్ సాంగ్ గా దీన్ని షూట్ చేస్తున్నారుట. ఇందుకోసం రాం చరణ్ పక్కన ఎందరినో అనుకున్నారు. కాజల్, రకుల్ లాంటి పేర్లు కూడా వచ్చాయి. ఇక అన్నీ కాదనుకుని కాధరిన్ ని కూడా ఒకే చేసేశారు. అయితే చివరి నిముషంలో ఏమిందో ఏమో ఇపుడు ఆమెను కాదనుకుని ఈషా గుప్తా ని తెరపైకి తెచ్చారు. 


ఈ హాట్ బేబీ చరణ్ పక్కన చిందులేయబోతోందంటున్నారు. ఈషా హాట్, చరణ్ హీట్ కలిస్తే బోయపాటి డైరెక్షన్లో ఓ రేంజిలో కేక పెట్టేలని ఐటెం సాంగ్ వస్తుందని అంటున్నారు. ఈ నెల 14 నుంచి ఈ సాంగ్ ని అన్నపూర్ణా స్టూడియోలో షూట్ చేస్తారట. మరి ఈషా తన హాట్ పోజులతో ఈ సాంగ్ కి కిక్కు ఎలా పెంచుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: