మళియాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,  వి ఎ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుమ్బువూర్ నిర్మిస్తున్న ‘ఒడియాన్’తెలుగు లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.  ఇప్పటి వరకు ఓ మళియాళ మూవీ ఈ రేంజ్ లో రిలీజ్ కావడం మొదటి సారి అంటున్నారు.  తెలుగులో ఈ సినిమాను 200కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.   ఈ సినిమాను, మలయాళంతో పాటు తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు.   అంతే కాకుండా  మొదటి సారి  100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న సినిమాగా ఒడియాన్ నిలవడం విశేషం. 

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఒడియాన్ ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.  మోహన్ లాల్ గత  సినిమాలు కొన్ని 100కోట్ల గ్రాస్ ను అందుకున్నప్పటికీ ప్రీ రిలీజ్ ఈ రేంజ్ లో ఎన్నడూ జరగలేదు. ఇక మొదటిసారి 100 కోట్ల మార్క్ బిజినెస్ ను చాలా ఈజీగా అందుకోనుందని అంటున్నారు.  ఇక సినిమా గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. డిఫరెంట్ లుక్స్ తో  సూపర్ పవర్స్ కలిగిన యోధుడిగా ఈ సినిమాలో మోహన్ లాల్ కనిపించనున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం మోహన్ లాల్ ఏకంగా పది కిలోలు బరువు తగ్గి యువకుడిలా కనిపించబోతున్నారట..అంతే కాదు మరోపాత్రలు వృద్దుడిగా కనిపించబోతున్నారు..ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది.  మోహన్ లాల్ కి ఉన్న క్రేజ్ తెలుసు..మలయాళంలో ఈ స్థాయి బిజినెస్ చేసిన మొదటి సినిమా ఇదే. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా  మంజు వారియర్ నటించగా మరో ముఖ్యపాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.  మొత్తానికి మోహన్ లాల్  నటించిన ప్రయోగాత్మక సినిమా ఒడియాన్ ఇప్పుడు సౌత్ లో అందరిని ఆకర్షిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: