తెలుగు ఇండస్ట్రీలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్. ఈ చిత్రం రెండు భాగాలు గా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ హైదరాబాద్ లో... ఆడియో రిలీజ్ ఈవెంట్ నందమూరి తారకరామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో జరగనున్నాయి. డిసెంబర్ 16న ట్రైలర్ లాంచ్.. 21న ఆడియో వేడుక భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, లెజెండరీ కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ చిత్రం ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కి మంచి గుడ్ న్యూస్ చెప్పడంతో సంతోషంలో ఉన్నారు.