ఆరాధన ఎవరినైనా ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది. సినీ నటులకు మరీ ఎక్కువ. మరి నటీమణులకు కూడా అంతే. అయితే వారు ఆ విషయాన్ని బయటకు వెలిబుచ్చే సందర్భాలు చాలా తక్కువ. అయితే అలా ఒక సీనియర్ అందాల రాశి ఒక టైగర్ లాంటి కథానాయకుడు విషయంలో జరిగింది. 
Image result for kushbu the beauty of her times
తాము ఆరాధించే నటుడి గురించి ఒక సెలబ్రెటీ కాంప్లిమెంట్ ఇస్తే ఆ నటుడి అభిమానులకు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందం కూడా తారస్థాయికి చేరింది. జూనియర్ గురించి ఒకప్పటి అందాల అగ్ర కథానాయిక, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బు ఈ మద్య ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు  నందమూరి తారక రామారావు అభిమానులు ముచ్చటపడుతూ మురిసిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని, అతడికి తాను అభిమానినని ఖుష్బూ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. 
Related image
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనలో ఆయనపై ఉప్పొంగే అభిమానాన్ని మరింతగా చాటింది. ఇప్పుడు సినీరంగం వదిలేసి రాజకీయరంగంలోకి వచ్చేశారుకదా! బోల్డ్‌ గా చెప్పండి మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అని విలేఖరి అడిగితే, తమిళనాడులోనా? తెలుగులోనా? అని అడిగింది ఖుష్బు. తెలుగులో అనగానే! "నేను జూనియర్ ఎన్టీఆర్‌ కు చాలా పెద్ద అభిమానిని. అయ్యయ్యో! నాకు తారక్ అంటే పిచ్చి! అతడి సినిమా అంటే చిన్న పిల్లలాగా థియేటర్‌కు వెళ్లి చూస్తూ విజిల్ వేయాలి, క్లాప్స్ కొట్టాలి, పేపర్లు చించి తెరపై విసిరేయాలి, అన్నంతగా ఉంటుంది తారక్ మీద నా అభిమానం" అని ఖుష్బు ఎంతో ఉత్సాహంగా చెప్పింది.
Image result for kushbu about junior NTR
మరి ఈ అభిమానం గురించి తారక్‌ తో చెప్పారా? అని అడిగితే, చెప్పడమే కాదు, ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నానని ఖుష్బు వెల్లడించింది. ఖుష్బు యమదొంగ లో ఎన్టీఆర్‌ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె యముడి సతీమణి పాత్రలో కనిపించింది. మరి ఆ సమయంలోనే తారక్ మీద అభిమానం ఏర్పడిందా? అంటే, అదేం కాదని, "స్టూడెంట్ నంబర్ వన్" చూసినప్పటి నుంచే తాను ఎన్టీఆర్‌ కు పిచ్చి అభిమానిగా మారిపోయానని ఖుష్బు చెప్పడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: