టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.  తెలుగు లోనే కాకుండా హిందీ సినిమాల్లో నటించిన రానా అక్కడ తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో భళ్లాళదేవ లాంటి ప్రతినాయకుడి పాత్రలో నటించిన రానాకు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. 

Image result for హిరణ్యకశిప

 ఒకరకంగా చెప్పాలంటే..హీరో ప్రభాస్ కి ఎంత పేరు వచ్చిందో రానాకు అదే స్థాయిలో పేరు వచ్చింది. ఇక ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న గుణశేఖర్ ‘రుద్రమదేవి’తర్వాత ఏ సినిమా తీయలేదు.  తాజాగా రానా హీరోగా దర్శకుడు గుణశేఖర్  'హిరణ్యకశిప' టైటిల్ తో ఓ పౌరాణిక సినిమా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రుద్రమదేవిని భారీ హంగులతో సొంతంగా నిర్మించి, డైరెక్ట్ చేసిన దర్శకుడు గుణశేఖర్ నష్టాల్లో మునిగిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

Image result for హిరణ్యకశిప

ఇక  'హిరణ్యకశిప' కు సంబంధించిన పనులు అన్ని వైపులా నుంచి చురుకుగా జరుగుతున్నాయని చెబుతున్నారు.  హైదరాబాద్ లో ఈ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తు నడుస్తూ వచ్చింది అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లో గ్రాఫిక్స్ కి సంబంధించిన ప్లానింగ్ సిద్ధమైపోయిందట.  ఈ ప్రీ ప్రొడక్షన్ పనులను గుణశేఖర్ తో పాటు అప్పుడపుడు రానా కూడా దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Image result for హిరణ్యకశిప

సురేశ్ బాబు, గుణశేఖర్ మాట్లాడుకుని, జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సురేశ్ బాబు వున్నట్టుగా తెలుస్తోంది. రానా కెరియర్లో .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: