హీరోయిన్ల కేరీర్ కాలం చాలా తక్కువ. బిగువు, అందం ఉన్నంతవరకే వారికి అవకాశాలు. అందుకే అందాల పొందికను కొనసాగించేందుకు సుందరాంగులు చాలా తంటాలు పడుతుంటారు.
నోరు కట్టుకుని వ్యాయామం చేస్తూ నిత్యం ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొంత మందికి మాత్రం శరీర తత్వం చాలా పెద్ద ఎస్సెట్ అవుతుంది. వయస్సు మీదపడుతున్నా.. శరీరం బిగువు సడలదు.
ఇలాంటి ముద్దుగుమ్మల్లో బాలీవుడ్ హీరోయిన షమా సికిందర్ ఒకరు. ఎప్పుడో దాదాపు 20 ఏళ్ల కిందట మన్ సినిమాతో ఈమె తెరంగేట్రం చేసింది. అమీర్ ఖాన్‌తో జట్టుకట్టి తొలిసినిమాయే హిట్ కొట్టింది.
ఆ తర్వాత పెద్దగా సక్సస్ లు లేకపోయినా సినీ హీరోయిన్ గా ఇంకా నెట్టుకొస్తూనే ఉంది. ఇటీవల సినిమాలు తగ్గినా.. వెబ్ సిరీస్‌లతో సందడి చేస్తోంది.
ఈ వెబ్ సీరిస్ సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూస్తే.. ఈ అమ్మడు వయస్సు 40 దగ్గరపడుతుందంటే నమ్మడం కష్టమే మరి. కొత్త హీరోయిన్లతో పోటీపడుతున్న షమా లావణ్యం చెప్పుకోదగిందే సుమా.