2018 ఇయర్ ఎండింగ్ వస్తున్న సందర్భంగా గూగుల్ నిర్వహించిన సెర్చింగ్ సర్వేల్లో టాప్ ప్లేస్ లో మళయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ నిలిచింది. ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో సౌత్ లోనే కాదు దేశమంతా ఆమెకు ఫిదా అయ్యారు. కన్నుగీటి మరి కుర్రాళ్ల మనసులను గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ హేమా హేమీలను దాటి టాప్ ప్లేస్ లో ఉంది.


ఆమె కోసం ఈ ఇయర్ గూగుల్ లో చాలా మంది వెతికారట. గత కొన్నాళ్లుగా టాప్ లో ఉండే సన్ని లియోన్ ఈసారి గూగుల్ సెర్చింగ్ స్కోర్ లో టాప్ లో నిలవలేకపోయింది. ఇండియాలో పోర్న్ సైట్స్ బ్యాన్ తో పాటుగా బలీవుడ్ లో ఆమెకు అవకాశాలు సన్నిగిల్లడంతో సన్ని లియోన్ అడ్రెస్ లేకుండా పోయింది.


గూగుల్ సెర్చింగ్ టాప్ రేటింగ్స్ లో టాప్ 10 మెంబర్స్ ఎవరు అంటే.. ప్రియా తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు నిక్ జోనాస్. ప్రియాంకా చోప్రాని ప్రేమించి పెళ్లాడిన నిక్ జోనాస్ గురించి ఎక్కువమంది వెతికారు. ఇక బిగ్ బాస్ కంటెస్టంట్, డ్యాన్సర్ సప్నా చౌదరి 3వ స్థానంలో ఉంది. ప్రియాంకా చోప్రా 4వ ప్లేస్ దక్కించుకుంది.


5వ స్థానంలో సోనం కపూర్ భర్త ఆనంద్ ఆహుజా ఉన్నాడు. మే నెలలో సోనం కపూర్ తో ఇతనికి పెళ్లైంది. మ్యారేజ్ ఎనౌన్స్ మెంట్ నుండి ఇతని గురించి డీటైల్స్ తెలుసుకునే పనిలో గూగుల్ సెర్చ్ లో వెతికేశారు. ఇక 6 నుండి 10 స్థానాల్లో సారా ఆలీ ఖాన్, సల్మాన్ ఖాన్, మేఘన్ మార్కెల్, అనూప్ జలోటా, బోనీ కపూర్ లు ఉన్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: