ప్రియా ప్రకాష్ వారియర్ పేరు తెలియనివారు ఉండరు. ఒక్క వీడియోతో ఓవర్‌ నైట్ స్టార్ సెలిబ్రిటీగా మారిపోయిన ఈమెను తెలుగు సినిమాలలో నటింపచేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ ఆమె స్పందించడం లేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగిన సెలెబ్రెటీ 2018 సంవత్సరం గూగుల్ సెర్చ్ రికార్డ్స్ లో ప్రధమ స్థానం పొంది సన్నీ లియోన్ ను పక్కకు తప్పించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత రెండు మూడేళ్లుగా గూగుల్‌ లో ఎక్కువ సెర్చ్ చేసిన లిస్టులో సన్నీ
లియోన్ టాప్ పొజిషన్ ఉంటే ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రియ వారియర్ పొందింది. 
ప్రియా వారియర్
లేటెస్ట్ గా గూగుల్ విడుదల చేసిన మోస్ట్ సెర్డ్చ్ పర్సనాలిటీల లిస్ట్ లో ప్రియ వారియర్ కు ప్రధమ స్థానం రావడమే కాకుండా ఆస్థానం తరువాత ప్రముఖ స్థానాలు ఆక్రమించిన సెలెబ్రెటీల పేర్లు కూడ అత్యంత ఆశ్చర్యకరంగా మారాయి. అంతేకాదు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ సన్నీ లియోన్ టాప్ 10లో కూడా చోటు దక్కించుకోలేక పోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రియ వారియర్ స్థానం తరువాత ఈ ఏడాది ఇండియాలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన లిస్టులో రెండో స్థానం దక్కించుకున్న మరొక వ్యక్తి ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్. 
 మూడో స్థానంలో బిగ్ బాస్ కంటెస్టెంట్
అదేవిధంగా ఈ లిస్టులో మూడో స్థానంలో బిగ్ బాస్ 11 కంటెస్టెంట్, హర్యాన డాన్సర్ సప్నా చౌదరి నిలిచింది. ఇక ప్రియాంక చోప్రాకు 4వ స్థానం లభిస్తే ఈలిస్టులో 5వ స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ నిచింది. ఇక సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ కూతురు సారా అలీ ఖాన్ గురించి కూడా ఈ ఏడాది నెటిజన్లు బాగా సెర్చ్ చేశారు ఈ లిస్టులో ఆమె 6వ స్థానంలో నిలిచింది. సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా పరిచయం అవుతూ ఉండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని ఏర్పడ్డ ఆతృత వల్ల ఈ స్థానం ఆమెకు దక్కింది. బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఈ లిస్టులో 7వ స్థానం వచ్చినా అతడి స్థానం క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే బాగా తగ్గడం ఆశ్చర్య పరుస్తోంది. 
సల్మాన్ ఖాన్
దీనికితోడు బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిన అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ గురించి కూడా ఇండియాలో ఎక్కువ మంది సెర్చ్ చేశారు. అయితే మరింత ఆశ్చర్యకరంగా ఈ సెర్చింగ్ లో 65 ఏళ్ల భజన్ మేస్ట్రో అనూప్ జలోటా ఈ లిస్టులో 9వ స్థానం దక్కించుకోవడం హాట్ న్యూస్ గా మారింది. ఈ ఏడాది బిగ్ బాస్ 12లో చోటు దక్కించుకున్న ఇతగాడు యంగ్ సింగర్ జస్లీన్‌తో ఎపైర్ పెట్టుకున్నట్లు వచ్చిన వార్తలతో ఇతడు బాగా పాపులర్ అయ్యాడు. అయితే శ్రీదేవి మరణించినా ఆమె భర్త బోనీ కపూర్ టాప్ 10 లిస్టులో స్థానం సంపాధించుకోవడం శ్రీదేవిని ఇంకా ఎలా మరిచిపోలేక పోతున్నారో అర్ధం అవుతుంది. అయితే ఈ గూగుల్ సెర్చ్ టాప్ 10 పొజిషన్ లో ఒక తెలుగు వ్యక్తి కూడ లేకపోవడం గమనార్హం..



మరింత సమాచారం తెలుసుకోండి: