ప్రస్తుతం విజయ్ దేవరకొండకు కొనసాగుతున్న మ్యానియాతో అతడి అభిమానులు మెగా పవర్ సూపర్ స్టార్ అంటూ ఆకాశానికిఎత్తేస్తున్నారు. ప్రస్తుతం అతడికి కొనసాగుతున్న క్రేజ్ తో పాటు అతడు నటించబోతున్న మూవీల లిస్టు చూస్తుంటే మరో పదేళ్ళ పాటు విజయ్ మ్యానియా కొనసాగే అవకాసం కనిపిస్తోంది.   

ప్రస్తుతం ఈ క్రేజీ హీరో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై `డియర్ కామ్రేడ్`లో  నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఒక  తెలుగు తమిళ ద్విభాషా చిత్రంకు కూడ విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.   వీటితో పాటు గీతా ఆర్ట్స్ స్టూడియో గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ యువి క్రియేషన్స్ కు  సంబంధించిన మూవీ ప్రాజెక్ట్స్ లో నటించ బోతున్నాడు. 

ఇది ఇలా ఉండగా మరో ప్రముఖ నిర్మాణసంస్థ త్వరలో విజయ్ దేవరకొండతో నిర్మించ బోతున్న మూవీ ప్రాజెక్ట్ కు ‘హీరో’ అన్న టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో హీరో అన్న టైటిల్తో  మెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల క్రితం విజయ్ బాపినీడు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నటించి నిర్మించిన ‘హీరో’ మూవీలో నటించాడు. చిరంజీవి సరసన రాధిక కథానాయికగా నటించింది.  

1984లో రిలీజైన ఈమూవీ అప్పట్లో బ్లాకు బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఆ టైటిల్ ను విజయ్ దేవరకొండకు వాడబోతున్నారు. దీనితో విజయ్ దేవరకొండ సుప్రీం ‘హీరో’ అయిపోయాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న `డియర్ కామ్రేడ్`  మూవీ  కాకినాడ పరిసరాల్లోషూటింగ్ జరుపుకుంటోంది. అయితే ప్రస్తుతం విజయ్ కి ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ కధలో చాలా మార్పులు చేస్తున్న నేపధ్యంలో  ఈమూవీ విడుదల వచ్చే ఏడాది మధ్యలోనే జరుగుతుంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: