అసలే మెగా హీరో మూవీ అంటేనే ఓ రేంజి ఉంటుంది. దానికి మరింత మసాల జత చేస్తే అది పీక్స్ కి వెళ్ళిపోతుంది. ఇపుడు అలాంటి పనిలోనే సెన్షేషనల్ డైరెక్టర్ కొరటాల శివ ఉన్నారట. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఈ ఇద్దరూ ఒకే మూవీలో నటించేలా బ్రహ్మాండమైన ప్లాన్ తో కొరటాల స్టొరీని డిజైన్ చేశారట. ఈ మూవీ పై లేటెస్ట్ గా వస్తున్న అప్ డేట్స్  ఇపుడు మెగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి.


కొరటాల, చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి విధితమే. ఈ మూవీ సందేశాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో ఓ బలమైన పాత్రను చిరు పోషిస్తున్నారు. ఇక ఆ పాత్రకు సపోర్ట్ గా ఉండే మరో కీలక్ల పాత్రను కూడా కొరటాల త్రన స్టోరీలో రాసుకున్నారట. ఆ పాత్రకు ఎవరో కాదు, ఏకంగా మెగా పవర్ స్టార్ చేతనే చేయించాలని కొరటాల డిసైడ్ అయ్యారట. ఇపుడు దానికి చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరో మారు వెండి తెరపై తండ్రీ కొడుకులను చూసుకునే అవకాశం మెగా ఫ్యాన్స్ కి దక్కనుంది.


అంతకు ముందు ఖైదీ నంబర్ 150లో కూడా చిరు, చరణ్ కనిపిస్తారు. అలాగే చరణ్ మూవీ బ్రూసిలీ లో కూడా చిరు కొద్ది నిమిషాలు మెరుస్తారు. కానీ ఈ మూవీలో అలా కాకుండా కొంతసేపు కనిపించే పాత్రగా చరణ్ ది ఉండబోతోందిట. ఈ వార్త ఇపుడు వైరల్ కావడంతో మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సంక్రాంతి పండుగ తరువాత షూటింగ్ ప్రారంభిస్తారని భోగట్టా.



మరింత సమాచారం తెలుసుకోండి: