అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని ప్రస్తుతం స్టార్ హీరో హోదాలో కొనసాగుతున్నారు.  కెరీర్ బిగినింగ్ లో ఏమాత్రం కలిసి రాకపోయినా..తన మేనరీజంతో మాస్ లుక్ తో అభిమానులను సంపాదించుకున్నాడు.  అందుకే నేచురల్ స్టార్ అని అంటారు.  భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుసగా విజయాలు అందుకుంటున్నాడు.  ఆ మద్య కృష్ణార్జునులు సినిమా నిరాశపరిచింది.  ఈ మద్య కింగ్ నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ ‘దేవదాస్’ సినిమాలో నటించాడు నాని. 
Image result for nani jersey movie
కమర్షియల్ గా హిట్ కాకున్నా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.  ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమాతో బిజీగా వున్నాడు.  నాని ఒక సినిమా ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతున్న సమయంలోనే మరో ప్రాజెక్ట్ ఓకే చేయడం..షూటింగ్ మొదలు పెట్టడం లాంటివి చేస్తున్నారు.  'జెర్సీ' సినిమాతో బిజీగా ఉన్నా... నాని తదుపరి సినిమా .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.
Image result for nani jersey movie
ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల్లోనే విక్రమ్ కుమార్ వున్నాడు.  ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నారట.  కాకపోతే మెయిన్ హీరోయిన్ ఒక్కరే అయినప్పటికీ..తన జీవితంలో తారసపడే అమ్మాయిల్లా వారు కనిపించబోతున్నారట.  ఈ అయిదుగురు కథానాయికలను ఎంపిక చేసే పనులు చురుకుగా జరుగుతున్నాయట. 

నాని సరసన నటించి హీరోయిన్లకు మంచి లైఫ్ లభిస్తుంది.  ఇప్పటికే కీర్తి సురేష్, నివేదితా థామస్, మెహ్రీన్ లాంటి హీరోయిన్లు వరుస ఛాన్స్ లు కొట్టేస్తున్నారు.  మరి ఈ ఐదుగురు హీరోయిన్లు ఎవరూ..?వారితో నాని చేసే రొమాన్స్ ఏంటో త్వరలో చూడబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: