సీటీ బ్యూటీ అనుష్క కఠినమైన నిర్ణయం ఒకటి తీసుకుంది. ఈ అందగత్తె ఇలా సడెన్ గా డెసిషన్ తీసుకోవడంతో నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా షాక్ తింటున్నారు. అనుష్క మంచి నటి, అంతకు మించి అందగత్తె. ఆమె తెలుగులో చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ అందరి అభిమానాన్ని అందుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటితరం  నటీమణులు వేయలేని ఎన్నో అపురూప  పాత్రలలో మెప్పించిన హీరోయిన్ గా ప్రత్యేకతను నిలబెట్టుకుంది. అనుష్క గ్లామర్ తో పాటు గ్రామర్ కూడా తెలిసిన నటి కావడంతో మంచి పాత్ర ఉంటే ఆమెనె వెతుక్కుని వస్తోంది.


ఇదిలా ఉండగా ఇకపై తాను మరింత సెలెక్టివ్ గా ఉంటానని అనుష్క చెబుతోంది. తనకు పాత్ర నచ్చితేనే సినిమా అంటోంది. నిజానికి అనుష్క ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా తగ్గించేసింది. బాహుబలి 2 తరువాత అనుష్క ఒకటి రెండు తప్ప కొత్తగా చేసింది లేదు. ఇక సీనియర్ హీరోల ప్రస్టేజియస్ ప్రాజెక్ట్లను సైతం అనుష్క కాదనడం విశేషం. దాంతో ఆమె సినిమాలు ఇక చేయదా అన్న అనుమానాలు కూడా అందరిలో కలిగాయి.


దానికి తగినట్లుగానే తాను ఇకపై మంచి పాత్ర ఉంటేనే ఒప్పుకుంటానని అనుష్క డిసైడ్ అవడంతో ఆమె అభిమానులు సైతం షాక్ తింటున్నారు. అరుంధతి బాహుబలి వంటి సినిమాల్లో ల్లో అనుష్క తప్ప ఎవరినీ ఊహించుకోలేని స్థితి. మరి అంటువంటిది ఆమె ఈ నిర్ణయం తీసుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ముద్దు గుమ్మ తన మనసు మార్చుకుని ఏమైనా వెనక్కు తగ్గుతుందా అన్న‌దే ఇపుడు అందరిలో ఉన్న చిన్న ఆశ. లేకపోతే అనుష్క పాత సినిమాలు చూసి అభిమానులు  గడిపేయడమే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: