ప్రచారం, పబ్లిసిటీ మార్కెట్లో ఓ వస్తువు అమ్ముడుపోవాలన్నా ఇవి తప్పనిసరి. మరి ఆ వస్తువు గ్లామర్ ప్రపంచానికి సంబంధించినదైతే.. కుర్రకారును ఓ ఊపు ఊపేదైతే.. మరి ఇంకాస్త ఘాటు ప్రచారం అవసరమేగా.. ఈ విషయాన్ని నిరూపించిందో పాతికేళ్ల సుందరాంగి.



అవును.. 26 ఏళ్ల పాప్ సుందరి మిలీ సైరస్ ఇటీవల సింగిల్ పేరుతో ఓ కొత్త ఆల్బమ్ రూపొందించింది. ఈ అమ్మడి పాత ఆల్బమ్ యంగర్ విడుదలై సంవత్సరం దాటింది. అందుకే కొత్త ఆల్బమ్ ప్రచారం కోసం కొత్త ఎత్తుగడ వేసింది. టాప్ లెస్‌ లో పోజిచ్చి సోషల్ మీడియా ప్రచారం షురూ చేసింది.

ఈ ఆల్బమ్‌లో నథింగ్ బ్రేక్ లైక్ హార్డ్ అంటూ సాహిత్యం ఉంది. అంటే హృదయంలా ముక్కలయ్యేది ఇంకేదీ లేదు..అనేగా.. ఆ అర్థం మరింతగా సంగీత ప్రియులకు అర్థమయ్యేలా హృదయాన్ని చేతులతో కప్పుకుని Nothing breaks like a heart అంటూ క్యాప్షన్ పెట్టింది.



ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలే అందమైన అమ్మడు. ఆపై టాప్ లెస్ పోజు.. ఆలోచింపజేసే సాహిత్యం.. మరి ఇక ఈ పోస్ట్ వైరల్ కాకుండా ఉంటుందా. అమ్మడి లక్ష్యం నెరవేరకుండా ఉంటుందా..


మరింత సమాచారం తెలుసుకోండి: