సినిమా షూటింగుల్లో డూప్ ల వాడకం మామూలే. ఒకే హీరో రెండు, మూడు పాత్రలు చేస్తున్నప్పుడు.. రిస్కీ ఫైట్లు, స్టంట్ల విషయంలో హీరోలకు ఇబ్బంది కలగకుండా డూప్ లను వాడుతుంటారు. దాదాపు హీరో పర్సనాలిటీకి సూటయ్యే వ్యక్తులను ఇందుకు ఎంచుకుంటారు.



సాధారణంగా ఇలాంటి డూప్ లు అనామకులై ఉంటారు. పాపం.. ఆ సినిమాలో తాము నటించామని కూడా చెప్పుకోలేరు. మిగిలిన జూనియర్ ఆర్టిస్టుల్లాగానే వారి జీవితాలు తెల్లారిపోతుంటాయి. కానీ.. అలా నాగార్జున వంటి ప్రముఖ హీరోకు డూప్ గా నటించిన ఓ కుర్రాడు ఆ తర్వాత కాలంలో స్టార్ హీరో అయ్యాడు.

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. ప్రముఖ హీరో శ్రీకాంత్.. నమ్మలేకపోతున్నారా.. ఇది నిజం.. ఈ విషయాన్నే శ్రీకాంతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటికే శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పీపుల్స్ ఎక్ కౌంటర్ విడుదలైనా అంతగా అవకాశాలు వెల్లువెత్తలేదు. ఆ సమయంలో నాగార్జున కంట పడ్డారట శ్రీకాంత్.

Image result for hero srikanth


అప్పుడు హలో బ్రదర్ సినిమా షూటింగ్ జరుగుతోందట. డ్యూయల్ రోల్‌ కి డూప్ కావల్సి వచ్చి శ్రీకాంత్ ను సంప్రదించారట. దాంతో శ్రీకాంత్ హలో బ్రదర్‌ లో నాగార్జునకు డూప్ గా నటించాడు. హైట్, ఫిజిక్ నాగార్జునకు సరిపోవడంతో ప్రేక్షకులకు ఎక్కడా అనుమానం వచ్చే ఆస్కారం లేకుండా పోయింది. ఆ తర్వాత శ్రీకాంత్ కెరీర్ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: