సాధారణంగా లోన్ ఇచ్చే సంస్థలు ఏం అడుగుతాయి.. మీ జీతం ఎంత.. ప్లే స్లిప్ ఉందా.. మీ ఆరు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్ ఇవ్వండి.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతాయి. లేకపోతే.. ఏదైనా ఆస్తులు ఉంటే గ్యారెంటీగా పెట్టమని కోరతాయి. మరికొన్ని సంస్థలు ష్యూరిటీగా ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు అడుగుతాయి.
కానీ చైనాలోని కొన్ని సంస్థలు మాత్రం .. ఇవేమీ లేకపోయినా ఫర్వాలేదు. మీకు లోన్ ఇచ్చేస్తామంటున్నాయి. అందుకు చేయాల్సిందల్లా రుణం కోరేవారు.. తమ నగ్నచిత్రాలను, వీడియోలను సదరు కంపెనీకి సమర్పించుకోవాలి. ఎందుకంటారా.. ఒకవేళ లోన్ తీసుకున్న వారు సకాలంలో కట్టలేకపోతే.. వీటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తారన్నమాట.
మరి ఆ కంపెనీ వాటిని దుర్వినియోగం చేస్తే.. అలాంటి ఇబ్బందేమీ ఉండదట. ఆ మేరకు ఒప్పందం రాసి ఇస్తారట. ప్రత్యేకించి 20- 30 ఏళ్ల మధ్య అమ్మాయిలైతే.. ఎంతైనా లోన్ ఇస్తామంటున్నాయి ఈ సంస్థలు. ఇటీవల కొన్ని సంస్థలు రుణం తీర్చని అమ్మాయిలతో వ్యభిచారం కూడా చేయించారని అభియోగాలు వస్తున్నాయి.
క్రమంగా ఈ నేక్డ్ లోన్ బాధితులు పెరిగిపోతుండటంతో ఇప్పుడు వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయట. దీంతో చైనా సర్కారు ఇలాంటి సంస్థలపై ఓ కన్నేసిందట. సరైన అనుమతులు లేకుండా ఇలాంటి సంస్థలను నడపటం.. అమ్మాయిల బ్లాక్ మెయిలింగ్ అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారట.