ఐటెం సాంగ్ అంటే ఇపుడు అదో కమర్షియల్ ఫార్ములా. బాక్సాఫీస్ ని బద్దలు కొట్టే బ్రహ్మాస్రం. సినిమా మొత్తం ఒక ఎత్తు, ఐటం నంబర్ మరో ఎత్తు.  సరైన సాంగ్ పడిందా అంటే ఆ మూవీని ఎక్కడికో తీసుకుపోతుంది. మరి ఐటెం బాంబుల్లాంటి ఎంతో మంది ఉండగా హీరోయిన్లు కూడా ఇపుడు సై అంటూ ఐటెం సాంగ్స్ లో జిగేల్ మనిపిస్తున్నారు. అలాంటి జిగేల్ రాణిగా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు పూజా హెగ్డే. మెరుపు తీగలా ఉంటే ఈ ముద్దు గుమ్మ డ్యాన్స్ చేస్తే కేక పుట్టిస్తుంది. జిగేల్మని గుండెలను అదరగొట్టేస్తుంది.


ఐటెం సాంగ్స్ కి నేను రెడీ అంటోంది పూజా. తనకు నిజానికి డ్యాన్స్ అంటే ప్రాణమని, అందువల్ల ఐటెం నంబర్ అంటేనే ఎక్కువ డ్యాన్స్ ప్రాధాన్యత‌త ఇస్తారని, దాంతో తాను రెడీ అంటానని చెప్పుకొస్తోంది. రంగస్థలం మూవీలో జిగెల్ రాణీగా కెవ్వు కేక పెట్టించిన పూజ మళ్ళీ ఐటెం నంబర్ల వైపు పోలేదు. అయితే చాన్స్ వస్తే మాత్రం చిందులు వేసేందుకు రెడీ అంటోంది. 


ఇక టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మూవీస్ తో ప్రస్తుతం బిజీగా ఉన్న పూజా మరిన్ని కొత్త సినిమాలకు సైన్ చేశానని చెబుతోంది. ఇపుడు తాను ఫుల్ బిజీగా ఉన్నానని, తన డైరీ వచ్చే ఏడాది చివరి వరకూ నిండిపోయిందని కూడా చెప్పింది ఈ అందాల ఆడబొమ్మ. ఇక తనకు పెళ్ళి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదని, అయితే ఆ పెళ్ళి ఘడియ వస్తే ఆగుతుందా అంటూ గడుసుగా ప్రశ్నిస్తోంది. తల్లితండ్రులు చూసిన వారైన, మనసుకు నచ్చిన వాడైనా ఎవరు అయినా ఒకే కానీ పెళ్ళి ముహూర్తం ముంచుకు వచ్చినపుడే ఆ ఆలోచనలు అంటూ తెలివిగానే అంటోంది. మొత్తానికి పూజా హెగ్డే ఇపుడు టాలీవుడ్లో బ్యూటీగా తన స్టామినా ప్రూవ్ చేసుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: