నయనతార ఒక చిన్న పాపతో ఆడుకుంటూ, కౌగిలించుకోవడం చూసే వారికి చాలా సరదాగా , ఫన్నీ గా అనిపిస్తుంది. ప్రస్తుతం నయనతార స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శివ కార్తికేయన్, నయనతార నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ రాజేష్ దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజార్బైజాన్ లో కీలక సన్నివేశాలు చిత్రికరిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో నయనతార, శివ కార్తికేయన్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వీడియో బయటకు వచ్చి నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది. 

ప్రియుడితో రొమాన్స్

షూటింగ్ లొకేషన్ లో నయనతార ఓ పాపతో ఆడుకుంటున్న వీడియో చాలా క్యూట్ గా ఉంది. ముద్దొచ్చేలా ఉన్న ఈ పాపలో అల్లరి చేష్టలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార ఏమి చేసినా దానికి రెండింతలు చేస్తోంది. వయ్యారంగా కెమెరాకు ఫోజు ఇస్తోంది. ముద్దొస్తున్న ఆ పాప బుగ్గలు నయనతార గిల్లాగా.. వెంటనే ఈ అల్లరి పిల్ల కూడా నయన్ బుగ్గలని నలిపేస్తోంది. నయన్ మీద పది గట్టిగా కౌగిలించుకుంటోంది. ఈ దృశ్యం మొత్తం నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది. 

 అజార్బైజాన్‌లో షూటింగ్

నయనతార ప్రస్తుతం నటిస్తోంది అలాంటి ఇలాంటి చిత్రాల్లో కాదు. మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి, అజిత్ సరసన విశ్వాసంచిత్రాల్లో నటిస్తోంది. మరో వైపు విజయ్, అట్లీ కాంబోలో హ్యాట్రిక్ తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రంలో కూడా నయన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గ్లామర్, లేడీ ఓరియేంటేడ్, ఎమోషనల్ అది ఎలాంటి చిత్రం అయినా, పాత్ర అయినా నయన్ ఒదిగిపోయి నటిస్తుండడంతో ఆమెకు ఇంత క్రేజ్ నెలకొని ఉంది. 

https://twitter.com/twitter/statuses/1073621493139927041

మరింత సమాచారం తెలుసుకోండి: