Image result for varun tej antariksham
ఇప్పటివరకు హీరో అంటే ఒక స్టయిల్‌, ఒక రకమైన కథలకి కట్టుబడు ఉండాలి, ఒకసారి సక్సెస్‌ అయిన ఫార్ములాని నమ్ముకోవాలి, ఈ తరహా నమ్మకాలు సినిమా హీరోలకు మన టాలీవుడ్ లో తరతరాలుగా బలపడిపోయాయి. కొత్త తరహా కథలు చేసినా కానీ మరీ, అవుట్‌ ఆఫ్‌ ది వే, వెళ్లడానికి కాని స్టార్‌ ఇమేజ్‌ లేని హీరోలు కూడా సాహసించరు. అయితే ఇవన్నీ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ముందు మాత్రం బలాదూర్. అందరిలా,  రివాజులా మాత్రం ఇలా ఒకటే ఫ్రేంలో ఇమిడి వుండడానికి అసలు ఇష్టపడడం లేదు. 
Image result for multi-faceted varun tej
ప్రతి సినిమా తోను ప్రతి పాత్రతోను విభిన్నత చూపిస్తోన్న వరుణ్‌ తేజ్‌ భారీ ప్రయోగాలకి సైతం వెనుకాడడం లేదు. "అంతరిక్షం" లాంటి స్పేస్‌-థ్రిల్లర్‌ తో పాటు "ఎఫ్‌ 2" లాంటి కామెడీ సినిమాలో ఒకేసారి నటించేసిన వరుణ్‌ తేజ్‌ త్వరలో ప్రతినాయక పాత్రలో కనిపించటానికి కూడా రిస్క్ చేస్తున్నాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తీస్తోన్న "జిగరదండా" కు తెలుగు వెర్షన్‌ లో నెగెటివ్‌ రోల్‌ చేయడానికి వరుణ్‌ తేజ్ అంగీకరించాడట. 
Image result for varun tej antariksham
తమిళంలో అప్‌కమింగ్‌ యాక్టర్‌ బాబీసింహా చేసిన పాత్ర వరుణ్‌ తేజ్‌ చేయడం ఏమిటనే చర్చ ఉభయ చిత్ర సీమల్లో జరుగుతోంది. దీనిని ఎంచుకోవడంతో వరుణ్‌ తేజ్‌ ఇండస్ట్రీ లోని కథానాయకులందరికీ బలమైన షాక్‌ ఇచ్చినట్టయింది. 
Related image
వరుణ్‌ తేజ్ ఈస్థాయిలో ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తుంటే దర్శకులు అతడిలోని సృజనాత్మకతను ఎన్-కాష్ చేసి ప్రేక్షకులకు అందించటం కోవటం కోసం మరింత కొత్తగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ఇలాంటి సాహసాలు చేయలేని హీరోలు ఇక రానున్న కాలంలో సైడ్‌-లైన్‌ అవటం తధ్యం. మరీ బాలీవుడ్‌, కోలీవుడ్‌ యాక్టర్ల మాదిరిగా ఆలోచిస్తోన్న వరుణ్‌ తేజ్‌ దూకుడు తట్టుకోవడం అతని రేంజ్‌ కే చెందిన మిగిలిన హేరోలకు తలనొప్పిగా మారిందట.
Image result for mukunda varun tej with others 

మరింత సమాచారం తెలుసుకోండి: