వాళిద్దరూ హీరోయిన్లే.. వాళ్లిద్దరూ ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారట. ఏ సినిమా ఛాన్సుల దగ్గర గొడవో అనుకోవద్దు.. ఎందుకంటే వారు కొట్టుకున్నది ఇప్పుడు కాదు.. కొన్నాళ్ల క్రితం వరకూ .. అంటే వారిద్దరూ హీరోయిన్లు కాక ముందు.. మరి హీరోయిన్లు కాక ముందే ఎందుకు కొట్టుకున్నారు అంటారా.. ఎందుకంటే వారిద్దరూ అక్కా చెళ్లెల్లు కాబట్టి..

Image result for heroine KAJAL and nisha agarval


ఇంతకూ ఆ అక్కాచెళ్లెళ్లు ఎవరంటే కాజల్ అగర్వాల్, నిషా అగర్వార్.. ఈ విషయాలను హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. ముందుగా లక్ష్మీ కళ్యాణం ద్వారా సినిమాల్లో అడుగుపెట్టిన కాజల్.. ఇంకా తన కెరీర్ ను విజయవంతంగా నెట్టుకొస్తోంది.



అక్క అండతో సినీరంగంలోకి అడుగుపెట్టిన నిషా అగర్వాల్ మాత్రం చెప్పుకోదిగన విజయాలు సాధించలేకపోయింది. చిన్నాచితకా సినిమాల్లో చేయడమే కానీ ఒక్కటీ చెప్పుకోదగ్గ హిట్ దొరకలేదు. దాంతో క్రమంగా పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. ఇప్పుడు ఓ కొడుకు కూడా.

Image result for heroine KAJAL and nisha agarval

చిన్నతనంలో చెల్లెలు నిషా, తానూ తరచూ గొడవపడేవాళ్లమని చెబుతోంది కాజల్. ఇద్దరి మధ్యా వయస్సులో పెద్దగా తేడా లేకపోవడం వల్ల ఎవరూ వెనక్కి తగ్గేవాళ్లు కాదట. ప్రతి విషయంలోనూ ఇల్లుపీకి పందిరేసేలా గొడవపడేవారట. నిషా పెళ్లి వరకూ జుట్టు జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకునే వాళ్లమని చిన్ననాటి కబుర్లు చెబుతూ మురిసిపోతోంది కాజల్.


మరింత సమాచారం తెలుసుకోండి: