రాజమౌళికి అందరి టాప్ హీరోలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రభాస్ జూనియర్ లతో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం మాటలకు అందనిది. అందువల్లనే ఏమాత్రం అవకాశం దొరికినా రాజమౌళి తన సినిమాలను జూనియర్ ప్రభాస్ లతో చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఇలాంటి పరిస్థుతులలో త్వరలో జరగబోతున్న రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళికి సంబంధించి జూనియర్ ప్రభాస్ లు ఇవ్వబోతున్న ప్రీ వెడ్డింగ్ డిన్నర్ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
T Minister Throws A Challenge To Prabhas & Jr NTR
అత్యంత విలాస వంతమైన డిన్నర్ పార్టీలను హోస్ట్ చేయడంలో ప్రభాస్ జూనియర్ లను మించిన హీరోలు మరెవ్వరూ లేరు అని అంటారు. ముఖ్యంగా వీరు హోస్ట్ చేసే డిన్నర్ పార్టీలకు వెళ్ళే అతిధులకు వీరు చేసే అతిథి సత్కారాలు మొహమాటాలు తట్టుకోవడం కష్టం అన్న సెటైర్లు కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో కార్తికేయ కోసం మరో భారీ డిన్నర్ పార్టీకి ప్రభాస్ జూనియర్ లు చేయి చేయి కలిపారు. 
Jr NTR Hit Flop Movies
తెలుస్తున్న సమాచారం మేరకు హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ఒక విలాస వంతమైన రిసార్ట్ లో ఈ భారీ పార్టీ ఈవారం జరగబోతున్నట్లు సమాహారం. ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోలను కూడ ప్రభాస్ జూనియర్ లు వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా అనేకమంది ప్రముఖ దర్శకులు నిర్మాతలు మరికొంతమంది ప్రముఖ హీరోయిన్స్ ను కూడ ఈ పార్టీకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Image may contain: 2 people, people smiling
ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న జూనియర్ ‘సాహో’ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న ప్రభాస్ తమ ఖాళీ సమయాన్ని ఇలా తమకు అత్యంత సన్నిహితుడైన కార్తికేయ కోసం వెచ్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్తికేయ పూజా ప్రసాద్ ల వెడ్డింగ్ మరో స్టార్ వెడ్డింగ్ గా మారబోతున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ పెళ్ళి గురించి ముఖ్యంగా ఈ పెళ్ళి మండపం సెట్ గురించి రకరకాల ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: