రాజమౌళి తన కొడుకు కార్తికేయను దర్శకుడుగా కాకుండా నిర్మాతగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికోసం కార్తికేయ తన వంతు ప్రయత్నాలు చేస్తూ తానే  ఒక సొంత నిర్మాణ సంస్థను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్ పై ‘ఆకాశవాణి’ అనే టైటిల్ తో ఒక విభిన్నమైన కథను సినిమాగా తీయబోతున్నట్లు సమాచారం. 
హీరో మోహన్ లాల్‌ను అనుకొని
ఈమూవీ కథ 1980 కాలంనాటి కథ అని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈమూవీ కథలో విలన్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని టాక్. దీనితో మొదట్లో ఈవిలన్ పాత్రకు మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మోహన్ లాల్ ఈమూవీలో నటించడానికి ఒప్పుకున్నా భారీ పారితోషికం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. 
డాక్టర్ రాజశేఖర్ విలన్‌గా
దీనితో ఈమూవీ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ఈమూవీకి బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తున్న రాజమౌళి ఈవిలన్ పాత్ర కోసం రాజశేఖర్ పేరు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘గరుడవేగ’ సక్సస్ తరువాత రాజశేఖర్ తాను విలన్ పాత్రలకు కూడ అందుబాటులో ఉంటానని సంకేతాలు ఇచ్చినా మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. 
కల్కిగా హీరో రాజశేఖర్
ఇలాంటి పరిస్థుతులలో అనుకున్న విధంగా రాజమౌళి కొడుకు కార్తికేయ సినిమాలో నిజంగానే రాజశేఖర్ కు విలన్ అవకాసం వస్తే నిజంగానే అతడి సెకండ్ ఇన్నింగ్స్ చాల విజయవంతంగా ప్రారంభం అయినట్లు భావించాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి జరగనుంది. దీనికోసం ఏర్పాట్లు కూడా చిత్రబృందం పూర్తి చేస్తోంది. ఈసినిమాకు రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్నాడు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించనున్నాడు. దీనితో రాజమౌళి కుటుంబంలోని సెకండ్ జనరేషన్ వ్యక్తులు కూడా త్వరలో సెలెబ్రెటీలుగా మారబోతున్నారు అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: