మొదటి సారిగా ఎన్టీఆర్  , ప్రభాస్ ఇద్దరు కలిసి సందడి చేయబోతున్నాడు . నియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం టీం గా మారి ఒక గ్రాండ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారట. ఎవరి కోసమనా మీ డౌట్. రాజమౌళి వారసుడు కార్తికేయ పెళ్లి కోసం. జనవరి 5న జరగనున్న వివాహ వేడుకను పురస్కరించుకుని ఈ ఇద్దరూ కలిసి సెపరేట్ గా ఒక స్పెషల్ పార్టీ ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించిన ప్లానింగ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభోత్సవంలోనే జరిగిందట.

Image result for prabhas and ntr

ఇండస్ట్రీ లో ఉన్న హీరో హీరొయిన్లందరినీ ఒక చోటికి చేర్చి ఇప్పటిదాకా జరిగిన వాటిలో ఇదే బెస్ట్ అనిపించేలా సెలెబ్రేట్ చేయబోతున్నారట. ఎవరూ మిస్ కాకుండా అందరి దగ్గర ఖాళీగా ఉన్న డేట్ ని తీసుకుని ఫైనల్ గా ఒకటి ఫిక్స్ చేయబోతున్నట్టు తెలిసింది. దీనికి కారణం సింపుల్. అటు జూనియర్ కు ఇటు ప్రభాస్ కు ఇద్దరికీ రాజమౌళి తో బలమైన బాండింగ్ ఉంది. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ చేసింది తారక్ తోనే.

Image result for prabhas and ntr

ఆ తర్వాత సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి జక్కన్నను స్టార్ గా మార్చేసింది. యమదొంగ రేపిన సంచలనం చిన్నది కాదు. అది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో కొనసాగుతోంది. ఇక ప్రభాస్ కు ఛత్రపతి రూపంలో ఫస్ట్ మాస్ బ్రేక్ ఇచ్చిన రాజమౌళి బాహుబలి తో అతన్నో ఇంటర్నేషనల్ స్టార్ ని చేసాడు. అందుకే జక్కన్న అంటే ఈ ఇద్దరికీ ప్రత్యేకమైన అభిమానం. అది చూపించుకునే సందర్భం వచ్చేసింది కాబట్టి కార్తికేయ పెళ్లిని దాని కోసం వేదికగా మార్చుకోబోతున్నారు. డేట్ ఇంకా బయటపడలేదు కాని ఆ రోజు రచ్చ ఊహకందని రేంజ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్

మరింత సమాచారం తెలుసుకోండి: