బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' సెలిబ్రెటీ టాక్ షో లో ప్రభాస్ రానాలతో కలిసి పాల్గొన్న రాజమౌళి ప్రభాస్ వ్యక్తిత్యం పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ప్రభాస్ రానాలో బ్యాడ్ బాయ్ ఎవరు ? అంటూ రాజమౌళిని కరణ్ జోహార్ ప్రశ్నించినప్పుడు జక్కన్న ఈ షాకింగ్ ను కామెంట్స్ చేసాడు. 
అబద్దం చెబుతున్నారా?
ప్రభాస్‌ లోని బ్యాడ్ బాయ్‌ని కనిపెట్టడం అంతసులువు కాదని పైకి మంచి వాడులా ప్రభాస్ కనిపించినా లోలోపల ప్రభాస్ లో బ్యాడ్ బాయ్ ఉన్నాడు అంటూ జోక్ చేసాడు రాజమౌళి. ఇదే సందర్భంలో రానా రాజమౌళి మాటలకు అడ్డు తగులుతూ వాస్తవానికి తాను ప్రభాస్ కన్నా  మంచివాడినని అయితే తన పై బ్యాడ్ బాయ్ ముద్ర పడింది అంటూ  ‘నేనెప్పుడూ దొరికిపోతుంటాను' అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 
అనుష్కతో డేటింగ్‌పై గుచ్చిగుచ్చి అడిగితే ప్రభాస్ రియాక్షన్ ఇదీ
ఇదే సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కరణ్ జోహార్ ‘ప్రభాస్ నువ్వు ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదా'' అని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ ప్రభాస్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు చేసాడు. అయితే ఈమాటలకు ప్రభాస్ అంగీకరించకుండా తాను ఎవ్వరితోను డేటింగ్ డేటింగ్ చేయడంలేదు అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నాలు చేసాడు. 
 నువ్వు ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదా?
అంతేకాదు ఈ గాసిప్పులు అన్నీ మీడియా సృష్టి మాత్రమే అంటూ ఆవార్తలను ఖండించడానికి తన వంతు గట్టి ప్రయత్నాలు చేసాడు. దీనితో మరింత షాక్ అయిన కరణ్  జోహార్ రానా ప్రభాస్ ల వంక చూస్తూ మీరిద్దరూ సింగిల్‌ గానే ఉన్నారా ? అనే ప్రశ్నకు ప్రభాస్ రానాలు ఒకేసారి  రియాక్ట్ అవుతూ అవును అనడంతో ఆ సమాధానం విని కరణ్ జోహార్ ఆశ్చర్యపోయాడు. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న  ఈకార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలకు విపరీతమైన ప్రచారం ఇస్తున్నారు. దీనితో ఈపూర్తి కార్యక్రమం  ఎప్పుడు ప్రసారం అవుతుందా అన్న ఆసక్తి బుల్లి తెర ప్రేక్షకులలో బాగా పెరిగిపోవడంతో ఈకార్యక్రమానికి విపరీతమైన రేటింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: