తమన్నా స్టార్ హీరోయిన్. ఆమె టాలీవుడ్లో టాప్ హీరోలందరి పక్కన నటించి హిట్లు కొట్టిన భామ. ఇక అందం, అభినయంతో తనదైన స్టైల్ ని క్రియేట్ చేసిన ముద్దు గుమ్మ. అటువంటి తమన్నా కాస్టింగ్ కౌచ్ పై కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది.   ఫిల్మ్  ఇండస్ట్రీలో అటువంటిదేదీ లేదంటూ చాలా లైట్ గా చెప్పేసి పెద్ద దుమారమే స్రుష్టించింది.


తమన్నా వరకూ తీసుకుంటే ఆమె ఇపుడు స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమె వరకూ అటువంటి ప్రతిపాదనలు రావని అనుకుందాం. కానీ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అలాంటివి లేనే లేవంటూ తమన్నా మొత్తంగా సర్టిఫికేట్ ఇవ్వడంపైనే ఇపుడు వివాదం రేగుతోంది.  మిగిలిన హీరోయిన్లు ఈ విషయంలో వేరేగా రియాక్ట్ అయ్యారు. కొంత మంది కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు, మరి కొందరు మా వరకూ లేదని చెప్పారు. కానీ,  తమన్నా మాత్రం కాస్టింగ్ కౌచ్ అన్నమాటే  తాను ఎక్కడా వినలేదని చెప్పడం విశేషం అంటున్నారు.  పైగా ఫిల్మ్ మేకర్లకు అంత తీరిక ఎక్కడిది అంటూ వారిని వెనకేసుకురావడం పైనా సెటైర్లు పడుతున్నాయి.


నిజం చెప్పాలంటే కాస్టింగ్ కౌచ్ అన్నది తెలుగు చిత్ర సీమతో పాటు అన్ని చోట్లా ఉందని అంటున్నారు. దీనిపైన కొంతమంది బాధిత తారలు బయటకు వచ్చి తమ ఆవేదనను  కూడా వ్యక్తం చేశారు. మరి తమన్నా కామెంట్స్ నే తీసుకుంటే వారు చెప్పినది అబద్దం అనుకోవాలా. ఏది ఏమైనా ఈ అందాలా భామ మాత్రం ఇలా మాట్లాడడం బాగాలేదని అంతా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: