కైరా అద్వానీ తెలుగులో భరత్ అను నేను మూవీలో అందాల మహేష్ పక్కన మెరిసిన నెర జాణ. లేటెస్ట్  మూవీ వినయ విధేయ రామా. ఈ మూవీలో మెగా పవర్ స్టార్  రాం చరణ్ పక్కన జోడీ కట్టింది. ఈ మూవీలో కైరా గ్లామర్ స్పెషల్ అట్ట్రాక్షన్ అంటున్నారు. మాస్ పల్స్ ఫుల్ గా తెలిసిన డైరెక్టర్ బోయపాటి చేతిలో పడిన కైరా  యూత్ గుండెలను చిదిమేయడం ఖాయమని అంటున్నారు. కైరా కెవ్వు కేక పెట్టిస్తుందని, ముఖ్యంగా సాంగ్స్ లో తన సత్తా చాటి స్వీట్ డ్రీమ్స్  తెప్పిస్తుందని అంటున్నారు.


నిజానికి కైరా అద్వానీ బ్యూటీని భరత్ అను నేను మూవీలో సరిగ్గా చూపించలేదంటున్నారు. అందుకు ఆ మూవీలో ఉన్న కధ ఓ కారణం. సీరియస్ సబ్జెక్ట్ గా ఆ మూవీ తెరకెక్కడంతో ఎక్కడా రొమాన్స్ కి పెద్ద స్కోప్ లేకపోయింది. మరి ఇపుడు చరణ్ మూవీ ఆ లోటుని పూర్తిగా తీరుస్తుందని అంటున్నారు. ఈ మూవీలో కైరా రెచ్చిపోయి చేసిందని, మెగా ఫాన్స్ తో పాటు రస హ్రుదయులందరికీ ఈ సినిమా ఓ కను విందు అని చెబుతున్నారు.


ఇదిలా ఉండగా కైరా లేటెస్ట్ గా   రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఒక ఫోటో దిగి మరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరా ఫోటో చూసిన ఎవ్వరైనా రెడ్ హాట్ కైరా సూపరేహే అంటారు. వినయ విధేయరామ లో రామ్ చరణ్ పక్కన రెండు మూడు పోస్టర్స్ లో హాట్ హాట్ గా కనబడిన కైరా ఇప్పుడు ఈ రెడ్ హాట్ డ్రెస్ లో రామ్ చరణ్ వినయ విధేయరామ సాంగ్ ని ప్రమోట్ చేస్తూ తస్సాదియ్యా అన్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతం ఈ పిక్ లో మాత్రం కైరా అందాలు అదరహో అన్నట్టుగా ఉన్నాయి. చూడాలి మరి వినయ విధేయ రామా మూవీని అంటున్నారంతా అపుడే ఈ స్టిల్ చూసి.


మరింత సమాచారం తెలుసుకోండి: