ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండకు ప్రమాదం జరిగింది. కాకినాడలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో ట్రెయిన్ ఎక్కబోతూ విజయ్ జారి పడ్డారు. అయితే అదృష్టవశాత్తూ పెద్దగా గాయాలు కాలేదు. చేతికి మాత్రం గాయమైంది. ఈ వీడియోను విజయ్ దేవర కొండ స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.



విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రెడ్ సినిమా షూటింగ్ కాకినాడలో కొన్నిరోజులుగా జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ ట్రెయిన్ ఎక్కే సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. హీరో విజయ్ రన్నింగ్ ట్రయిన్ ఎక్కే సమయంలో కాలు జారి పడ్డారు.



ట్రయిన్ రన్నింగ్ లో ఉండగానే హీరో విజయ్ జారిపడటంతో అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. లక్కీగా పెద్ద గాయాలు కాకుండానే విజయ్ ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


అభిమానులు ఆందోళన చెందాల్సిందేమీ లేదని.. సినీహీరోలకు విజయాలు ఊరికినే రావని చెప్పేందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానని విజయ్ దేవరకొండ తన పోస్‌ లో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: