టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మలు గత ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా వీరి వివాహం జరిగి రెండో సంవత్సరం అడుగు పెడుతున్న సమయంలో తమ పెళ్లిరోజు కార్యక్రమాన్ని ఆస్ట్రేలియాలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.  అయితే కొంత కాలంగా అనుష్క శర్మ గర్భవతి అంటూ రుమర్లతో ఇటు బాలీవుడ్ అటూ సోషల్ నెట్ వర్క్ లలో తెగ చెక్కర్లు కొడుతున్న విషయం తెలసిందే కాగా తాజాగా దినిపై అనుష్క శర్మను అడిగితే ఈ విషయాన్ని గడ్డిపోసలాగా తీసిపడెసింది. 

anushka

ఈ కారణంగానే సినిమాలకు అనుష్క గ్యాప్ ఇచ్చిందని అంటున్నారు. ఈ వార్తలపై అనుష్క స్పందించింది. ఎవరైనా పెళ్లిని దాచగలరుకానీ, గర్భాన్ని దాచగలరా? అని ప్రశ్నించింది. ఇలాంటి పుకార్లను తాను ఏ మాత్రం పట్టించుకోనని చెప్పింది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఈ మద్య నేను గర్భం దాల్చినట్లు తెగ వార్తలు వస్తున్నాయి..అవును గతంలో మా పెళ్లి విషయాన్ని దాచామని..అందరికి తెలిసే విధంగానే వైభవంగా పెళ్లి చేసుకున్నామని..అయితే గర్భం వస్తే ఎలా దాచగలరు..అని ప్రశ్నించింది.


 సినీ పరిశ్రమలో ఉన్న వారిపై ఇలాంటి పుకార్లు రావడం సహజమేనని తెలిపింది. పెళ్లి కాకుండానే వివాహితను చేయడం, గర్భం దాల్చకుండానే తల్లిని చేయడంలాంటివి జరుగుతుంటాయని మండిపడింది. ఎప్పుడు ఏదో ఒక వార్తాలతో పుకార్లు పట్టిస్తారని దానిని ఏవరు నమ్మోద్దని చెప్పింది. గతేడాది డిసెంబర్ 11న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  కాగా అనుష్కశర్మ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ జీరో ప్రమోషన్‌లో అనుష్క బిజీబిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: