హీరోయిన్స్ కు సినీ ఇండస్ట్రీ లోనే కాదు బయట కూడా వేధింపులు తప్పడం లేదు . అయితే  ఇటీవల ఔరంగాబాద్ లో ఒక స్టోర్ ను ప్రారంభించడానికి వెళ్లిన జరీన్ ఖాన్ చేదు అనుభవాన్ని ఎదుర్కొందట. మాబ్ లోకి వచ్చిన చాలామంది హీరోయిన్లు ఎదుర్కొనే అనుభవమే జరీన్ కు కూడా తప్పలేదట. హీరోయిన్లు షాప్ ఓపెనింగ్స్ కు వచ్చినప్పుడు భారీ స్థాయిలో జనాలు గుమి కూడటం మామూలే. జరీన్ ఖాన్ అక్కడకు వెళ్లినప్పుడు కూడా ఔరంగబాద్ లో అదే జరిగిందట.

Image result for zarine khan

జనాలు భారీ స్థాయిలో అక్కడకు చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి తగిన స్థాయిలో ఏర్పాట్లు లేకుండా పోయాయి. దీంతో షాప్ ఓపెనింగ్ తర్వాత జరీన్ తన కారు వద్దకు వెళ్తున్న సమయంలో సమూహం చుట్టుముట్టింది. ఇక ఇదే అదునుగా ఆకతాయి ఒకడు రెచ్చిపోయాడట. జరీన్ ను అనుచితంగా తాకడానికి వాడు ప్రయత్నించినట్టుగా సమాచారం. వాడిని ధీటుగా ఎదుర్కొందట జరీన్. తన మీద పడిన వాడిని గట్టిగా తోసేసి తగిన సమాధానం చెప్పిందట.

Image result for zarine khan

చెంప పగుల గొట్టి పక్కకు తోసేసిందట జరీన్. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ విషయాన్ని జరీన్ కూడా ధ్రువీకరించింది. ఒక బూతు మాటను ఉపయోగించి ఆకతాయిని తిట్టింది జరీన్. వాడు తనను అసభ్యంగా తాకాలని చూశాడని, వాడికి తను తగిన బుద్ది చెప్పానని జరీన్ వివరించింది. హీరోయిన్లు షాప్ ఓపెనింగులకు వెళ్లినప్పుడు ఇలాంటి ఘటనల పరంపర కొనసాగుతూ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: